శ్రీరామదాసు పిల్లలం:- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్కర్నూల్ జిల్లా.
శ్రీరామదాసు పిల్లలం
జేసుదాసు మల్లెలం
పాట పాడు వారలం
ఆటలాడు పోరలం. !

భక్తి పాటలు ఎన్నుకుంటం
 భక్తజనుల నమ్ముకుంటం
తీర్థయాత్రలు చేస్తుంటం
కర్తవ్యాన్ని యోచిస్తుంటం !

రామదాసు కీర్తనలే రైటంటం
జేసుదాసు పాటలే సైయంటం
అడుగుల భజనను చేస్తుంటం
తడబడు మాటే ఇక లేదంటం !

రామదాసు ఆటలను ఆడించాం 
జేసుదాసు పాటలకు తలవంచాం
ఆయన పాటల పుస్తకాన్ని విప్పినం
మా మస్తిష్కానికి మేం పనిచెప్పినం

రామదాసు కీర్తనలను సేకరించి
జేసుదాసు వార్తలను స్వీకరించి
అచ్చు వేయిస్తాంలే పుస్తకాలను
మెచ్చుకునేలా చేస్తాం జనాలను!

జేసుదాసు రామదాసు ఇరువురు
పాటలు పాడేందుకవారు వెరువరు
వారు చేస్తారులే ఇక గంధర్వగానం
కోరిపోస్తారులేచెట్టూచేమకు ప్రాణం

వారి పాటలంటే చెవి కోసుకుంటం
కోరి వారి ఆటలే ఆడుట మేలంటం
వీలు చూసుకుని మేం ఆహ్వానిస్తాం
కీర్తనలను పాడించి ఇకసన్మానిస్తాం

రామదాసు మందిరాన్ని కట్టిస్తాం
వారి విగ్రహాన్ని అందులో పెట్టిస్తాం
మంగళ హారతిని ఇక ముట్టిస్తాం
జేసుదాసు కరాలచే ప్రారంభిస్తాం!

 ప్రతియేటా జాతరను నడిపిస్తాం
 రామదాసు స్తోత్రాలను వినిపిస్తాం
జేసుదాసుచే పాటలను పాడిస్తాం
ఆడుకొని పాడుకుని ఆనందిస్తాం !


కామెంట్‌లు