అసలైన ప్రజాకవి వేమన:- అంకాల సోమయ్య -దేవరుప్పుల- జనగామ-9640748497
మూఢనమ్మకాలతో సాంఘీక దురాచారాలతో 
కూనరిల్లుతున్నసమాజాన్ని సంస్కరించిన సంస్కర్త వేమన
ఆటవెలది ఛందస్సులోనాటి అసమసమాజాన్ని 
అలతి అలతి పదాలతో సామెతలు నానుడులు 
లోకోక్తులతో సమసమాజం దిశగా నడిపిన ప్రజాకవి వేమన.
విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో నగ్నసత్యాన్ని
తేటతెల్లం చేసిన ప్రగతిశీలవాది.

మచ్చుకు కొన్ని వేమన పద్యాలు
ఉప్పు కర్పూరంబునొక్కపోలికనుండు
చూడజూడరుచులజాడవేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా

గంగి గోవు పాలు గరిటెడైననుచాలు
కడివెడైననేమిఖరముపాలు
భక్తిగల్గుకూడుపట్టెడైననుచాలు

అనగనగా రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులుసమకూరుధరలోన
అంటూ వేమన కలాన్ని ఖడ్గంగా
 ఝళిపించిన అభ్యుదయవాది

లోకకవి, నిఖార్సైన ప్రజాకవి 
అందుకే అంటారు 
తెలుగునాట పామరుడైన  పండితుడైన
 "బావిలేని ఊరు వేమన పద్యం
 రాని నోరు తెలుగునాట ఉండదంటారు.
ఏ కాలానికైనా వేమన పద్యాన్ని అన్వయించుకోవచ్చు
తనకాలంకంటే ముందేమి జరుగునో
 తాను ఊహించి తేటతెల్లం చేసిన భవిష్యద్దర్శకుడు 
, క్రాంతదర్శి , దార్శనికుడు మన వేమారెడ్డి


కామెంట్‌లు