ఆత్మీయ స్నేహితుడే(దివ్యౌషధం):- అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ -9640748497
మీరు బాధల్లో ఉన్నప్పుడు 
బాల్యమిత్రుల్నికలిసిరండి
తనివితీరా మాట్లాడండి

చిన్న పిల్లవానివలే
కల్లాకపటం లేకుండా
ఒకరిమీదొకరుజోకులేసుకొని
పడిపడినవ్వుకోండి

మీరు చిన్ననాడు
చేసిన చిలిపి పనులు
మీకు దక్కిన ప్రశంసలు
మీరు సాధించిన ఘనవిజయాలు
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి

ఆత్మీయులైనమిత్రులతో
మనసు విప్పి మాట్లాడండి
అది
కోమాలో ఉన్న పేషెంట్ ను కూడా 
బ్రతికించే దివ్యౌషధం

మీ మీ ఉద్వేగాలు, దుఃఖాతిశయాల్నీ
దూరం చేసుకోవడానికి
మీ స్నేహితులకు వాట్సాప్ కాల్ చేయండి
అప్పుడు మీరు గట్టిగా మాట్లాడండి
 మీ చిరాకు పరాకు 
అంతా మటుమాయం అవుతుంది

ఈ రోజుల్లో 
మనం
యాంత్రిక జీవనానికి అలవాటుపడి
వస్తువుల్ని ప్రేమిస్తున్నాం

తద్వారా 
వ్యక్తుల మధ్య డబ్బు ,హోదా మొదలగు
అంతరాలు ఏర్పడి 
మనం నేడు
ఆత్మీయతానురాగాలు దూరం చేసుకొని 
బోన్సాయ్ బ్రతుకులు బ్రతుకుతున్నాం

ఇకనైనా మనంమారుదాం
శారీరక మానసిక 
ఒత్తిడిని అధిగమిద్దాం
ఆనందాన్ని ఆహ్లాదాన్ని మన సొంత చేసుకుందాం


కామెంట్‌లు