మన నేల, నీరు , గాలి....! : - కోరాడన రసింహా రావు !
పల్లవి :-మన నేల, నీరు, గాలి యెంతో పవిత్ర మైనవి రా...! 
  జన్మ-జన్మల పుణ్య ఫలమున ఇక్కడ జన్మ మెత్తితిమిరా...!!
   "మన నేల,నీరు,గాలి..."
చరణం :-
    పుణ్య గిరులు,పావన ఝరులు,చెట్టు,పుట్ట 
పూజ నీయమేరా...! మనకుపూజ నీయమేరా!! 
  " మన నేల,నీరు,గాలి... "
చరణం:-
సహజ సుందర ప్రకృతి సమతుల వాతావరణము
 జ్ఞాన బోధకులు, రుషులు,

 యోగులు భరత దేశ సంపదలు..! 
  మన భారత దేశసంపదలు..!! 
  "మన నేల, నీరు, గాలి..."
చరణం :-
  పరమాత సహనం , స్నేహ,మహింసలు 
భారతీ యుల ఔదార్యం, 
మన భార తీయులఔదార్యం !! 
  "మన నేల,నీరు,గాలి..."
చరణం :-
  కులాలు, మతాలు, భాషలు, యాసలు... 
  ఎన్నున్నా, మనమంతా ఒకటేరా...., 
  మన మంతా ఒకటే రా..! 
 జై స్వతంత్ర భారత్.... 
  జై జై స్వతంత్ర భారత్ 
 జయహో జయహో జయహో.....!!
    ******
కామెంట్‌లు