పద్య పద్మాలు: డా. సి వసుంధర

 ,(1) కందం 

       ***"
 చెట్టిల పూచియు కాచియు
 పుట్టెడుఫలములను నిచ్చు,పొందుగ దా,చే,                             
ముట్టదునొక్కటి నైనను
నిట్టివె గద మంచి వారి
 చేతలు చూడన్!
2.   కందం
       **""

పూజలుసేయుముమంచిది.           
 రాజిలు,రఘుపతిని                        
గూర్చి రమ్యముగానే. 
ఫోజుల కోసము సేయకు
నిజమగు భక్తితొ కొలు
వుము నిశ్చల మదితో
   3
ఆటవెలది
****
అమ్మచేతిలోన యమృతమున్నది,
అమ్మ ప్రేమ కెపుడు హద్దు లేదు.               
 అమ్మనీడ నీకు యాకాశమంతరా!
అమ్మనేపుడు నీవు నంటి వుండు
4.      కందం
         ****
హరియనురెండక్షరములను.                      
గురి గలిగి పలికినపుడది,గోవుల భంగిన్
దరిజేర్చు కొనుచు ప్రేమతో
శరణాగతి, ముక్తి క్షీర సంపద లిచ్చున్
కామెంట్‌లు