మధురమైన మాటలన్నీ
మంత్రాలే అనిపించినా
మనిషి తెలిసినంతనే
మనసు మనకు తెలిసేనా?
రూపం వెలుగుతుంటే
అపురూపమే అనిపించినా
అంతరంగమందు
ఆదరభావం అగుపించునా?
మాట పలుకు లేకపోయి
మౌనాన్ని ఆశ్రయించినా
మదిలోని యుద్ధాలు
మనుగడలో మార్పు తేవా?
బండరాతి గుండె చేసుకుని
బ్రతుకు వెళ్ళదీసినా
బాటలోన మాట కలిసి
మంచి స్నేహం దొరకదా?
గడ్డ కట్టిన హృదయమైనా
గతులు మారినప్పుడు
హితము కోరువారి కోసం
కరిగి కరుణ కురిపించదా?
తడి ఇంకే తావే లేని
రాతి మనసు నేలలో
రాళ్ళ మధ్య రాణించే
రవ్వలు కనిపించవా?
భావమంటూ కొంచెముంటే
బంజరైన భూమిలోన
బ్రతుకు అర్థం తెలిపే స్నేహం
బాటసారికి దొరకదా?
మబ్బుమూసి మసకైనా
మంచు పొగలే ముంచేసినా
పొడుచు పొద్దు సెలవెపుడూ
కావాలని ప్రకటించదుగా!
వెలుగు పంచే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి