శ్లోకం:
దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్య దుఃఖదురహంకృతి దుర్వచాంసి !
సారం త్వదీయచరితం నితరాం పిబంతం
గౌరీశ మామిహ సముద్దర
సత్కటాక్షైః !!
భావం,: పాపం కలిగించునవి, చెడు అక్షరములున్నవి మరియు దౌర్భాగ్యమును, దుఃఖమును, దురహంకారమును,ఏర్పరుచునవి
అగు చెడు మాటలను, విడచి పెట్టితిని. సారవంతమైన నీ చరిత్రను మిక్కిలిగా గ్రోలుచున్న నన్ను ఓ కైలాస వాసా ! నీ సత్కటాక్షములతో ఉద్ధరించుము.
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి