ఘనంగా బంజారా భజన సమ్మేళనం

 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో బంజారా రచయితల వేదిక ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మహోన్నతమైన బంజారా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 129 మంది భజన గాయకులు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పోహ్రాగడ్  పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్ , సురేష్ మహారాజ్ మాన్ సింగ్ మహారాజ్, శివలాల్ మహారాజ్, ఉమాజీ మహారాజ్ మొదలగు వారు పాల్గొన్నారు.
 ముఖ్య అతిథిగా రాథోడ్ భీంరావ్ నాయక్ , రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ను ఉపదేశించి పీఠాధిపతి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉన్నతమైనదని, సమాజం కోసం ఇలాంటి అత్యున్నతమైన కార్యక్రమం చేయడం, బంజారా  భజన కారులను పురస్కారంతో సన్మానించడం ఇది చాలా గొప్ప విషయమని, ఒకే వేదికపై 129 మంది భజన కారులను ఏకం చేయడం అంత సులువు కాదని ఇది చరిత్రలో నిలిచిపోతుందని  మరియు వారిని పురస్కారంతో సన్మానించడం చాలా గొప్ప విషయమని వారు అన్నారు. రాథోడ్ భీంరావు నాయక్ మాట్లాడుతూ సాహిత్య సేవ కోసం ఎప్పుడు ముందు ఉంటానని, సాహిత్యం వలన  సమాజం గుర్తింపు పొందుతుందని చెప్పడం జరిగింది. రాథోడ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ భజన కార్యక్రమం నిర్వహించడం తెలంగాణలోని మొదటిసారి అని గొప్పగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కవన కోకిల బంకట్ లాల్, బంజారా రచయితల వేదిక అధ్యక్షులు డా. ఇందల్ సింగ్ బంజారా, ప్రధాన కార్యదర్శి జాదవ్ ధరమ్ సింగ్, గౌరవ సలహాదారులు రాథోడ్ శ్రావణ్, ఉపాధ్యక్షులు జాదవ్ మురళి మరియు పవార్ వినోద్ కుమార్, కార్యదర్శులు డా. ముకుంద్ రావ్, చౌహాన్ పరమేశ్వర్, ప్రచార కార్యదర్శి చౌహాన్ గోవిందా నాయక్, సంపాదకులు జాదవ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంజారా భజన కారులు తమ సంతోషమును వ్యక్తపరుస్తూ, ఇలాంటి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని  సన్మానించడం ఆనందంగా ఉన్నదని కొనియాడారు.
కామెంట్‌లు