ముగ్గురు స్నేహితులు:- బొడ్డుపల్లి నందిని-ఏడవ తరగతి-ఆదర్శ పాఠశాల - వల్లాల
 అనగనగా ఒక అడవి ఉండేది ,ఆ అడవిలో ఒక చెట్టు కింద ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ఒకరికి ఒకరు ఎప్పుడు సహాయం చేసుకునేవారు, ఒకరోజు ఇద్దరూ స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి ఒక కాకి వచ్చింది, అది చూసిన స్నేహితులు ఇద్దరు ఎవరు నువ్వు? అని అడిగారు, నా పేరు కాకి, మరి మీ ఇద్దరి పేర్లు ఏమిటి? అని అడిగింది కాకి, నా పేరు చిలుక, నా పేరు పావురం, కాకి మరి నీకు ఇక్కడ ఏం పని అని అడిగింది పావురం? నేను ఇక్కడికి నివసించడం కోసం వచ్చాను, అని చెప్పింది కాకి, సరే సరే పదండి లోపటికి వెళ్దాం అని అన్నది చిలుక, నువ్వు ఏం తింటావు? అని అడిగింది పావురం, నాకు ఏమీ వద్దు కానీ కొన్ని నీళ్లు ఇస్తారా? అని అడిగింది కాకి, హా తెస్తాను ఆగు అంటూ వెళ్ళింది పావురం, అప్పుడు తనకి ఒక ఉపాయం వచ్చింది, ఆ నీటిలో విషం కలిపింది పావురం, ఆ నీళ్లు తాగిన కాకి కళ్ళు తిరిగి పడిపోయింది, అది చూసిన చిలుక ఆ నీటిలో ఏం కలిపావు? అని అడిగింది,అప్పుడు పావురం ఇలా అన్నది, నేను కాకి తాగే నీటిలో విషయం కలిపాను, అని అన్నది పావురం, ఎందుకంటే కాకి మన స్నేహాన్ని ఎక్కడ విడదీస్తుందో అని భయం వేసింది, అందుకే నేను అలా చేశాను, దానికి చిలుక ఇలా అన్నది, కాకి మన స్నేహాన్ని విడదీయడానికి రాలేదు, కాకి మనతో ఉండడానికి మరియు స్నేహం చేయడానికి వచ్చింది, అయ్యో! నేను అలా చేసినందుకు నన్ను క్షమించు మిత్రమా అన్నది పావురం, ఇలా మాట్లాడుతున్న సమయంలో కాకి స్పృహలోకి వచ్చింది, ఇలా ముగ్గురు మిత్రులు కలిసి మెలిసి ఉన్నారు.
చిలుక ,పావురం, కాకి .ఇది వీళ్ళ ముగ్గురి స్నేహం.

కథలోని నీతి: కలిసుంటే కలదు సుఖం 

కామెంట్‌లు