పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో భారతీయ తొలి ఉద్యోగిణి సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు శతాబ్దాల క్రితమే బాలికల పట్ల వివక్షతను, మూఢనమ్మకాలను, బాల్యవివాహాలవంటి దురాచారాలను నిలదీసారని అన్నారు. ఎన్నో బాలికల పాఠశాలలను నెలకొల్పిన మహిళా శక్తి సావిత్రీ బాయి పూలే అని అన్నారు. ఈ వేదికపై పాఠశాలలో హిందీ ఉపాధ్యాయని యిసై సౌజన్యవతిని శాలువా, పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. తొలుత సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాలాలంకరణ గావించి నివాళులర్పించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
సౌజన్యవతికి సావిత్రిబాయి పూలే జయంతి సత్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి