మోక్షపటం:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 మరణం అదొక అరుదైన పదం
అదే అంతిమ నిజం.
దగ్గరయ్యేకొద్దీ ఈ వాస్తవం
చేరుస్తుంది తప్పక కాలం.
ఆయుష్షుకు లేదు కనికరం
ప్రతి సంవత్సరం ప్రమోదం మాటున ప్రమాదం.
పుట్టిన రోజే నిష్క్రమణ ఖాయం
ఆజ్యంతో వృద్ధి నిత్యాగ్నిహోత్రం.
చితిపై చేర్చుటకు కల్గించును ప్రలోభం
కాంక్షలతో కడదేర్చుటకు పన్నాగం.
జీవనసూత్రాలకు తిలోదకం
ఋజాగ్రస్తం చేస్తూ హననం.
రుధిరమంతా మాయమగును క్షణక్షణం
అంతకంతకూ క్షీణించును శరీరం.
వాసనలు మాయమై తెలియును మర్మం
చివరకు మిగిలేది లేదను సత్యం.
అచేతనమవుతూ నిత్యనరకం
గరుడపురాణం చూపిన మార్గం.
మరో జన్మకు నేటి ప్రాయశ్చిత్తం
కర్మఫలాలే ఆజన్మాంతం.
త్రికరణశుద్ధి లేకుంటే మానవజీవనం
దాటలేరు ఎప్పటికీ మోక్షపటం.
భ్రమలు దాటి భ్రమరం
ఆస్వాదించును మధురం.
తెరలు దించును జీవనధర్మం.
కామెంట్‌లు