"తెలుగు తేనె ": - సేకరణ : -డాక్టర్ సి వసుంధర.
 తొలి తెలుగు కావ్య రచయిత్రి తాళ్ళపాకతిమ్మక్క. ఆమె  పదకవితా పితామహుడు,తాళ్ళపాక అన్నమయ్య మొదటి భార్య.
తిమ్మక్క రచించిన కావ్యం,సుభద్రా పరిణయం. తెలుగు పదాలతో వెలుగులు ప్రసరింప చేస్తున్న కావ్యం సుభద్రా పరిణయం. ఇది ద్విపద కావ్యం. ఇందులో 12 వందల విపదలు ఉన్నాయి  చక్కని జాతీయలు, చక్కని భావ మృదులత మొదలైన గుణాలతో సుభద్ర కళ్యాణం,ఆంధ్రుల ఆడపడుచు రాసిన మొదటి కావ్యమై
తర్వాతి వారికి దారి దీపమైనది. 
మచ్చుకు కొన్ని ద్విపద పాదాలు 
     X x x 
(శ్రీకృష్ణుడు చెల్లెలైన సుభద్రను తన దగ్గరకు రమ్మని పిలిచినప్పుడు ఆమె వచ్చిన సందర్భంగా )
"అని యిట్లు తమ అన్న అంకించి పిలువ 
పసిడి సలాక నా పణతి సుభద్ర 
వలిపువ్వు  గుత్తుల
పలిరాకు బోణి.
 లలతి సౌరభ శోభ గుటకరింపంగా
ససి చక్కగా పైట సవరించుకొనుచు
నడనడ చిన్నారి నడుము జవ్వాడ అందియలు మ్రోయంగా హారముల్ తూగ
మొల నూలు ఘంటలు మద్దియల్ మ్రోయ
సంది దండలు వెల్గ సరిపెనలు దూల దివ్వలై హారములు 
తెరువు చూపగను నల్లన వచ్చే అన్న ముందరికి భద్రేభగమన,సుభద్ర రమ్మనచు తోయ 
 జాక్షుడు తన తొడపైన నునిచే
ససి..సిగ్గు
సౌరభము.కుంకుమ
తెరువు..దారి
అంకించి....ప్రేమగా
గుటకరించుట.. ఉవ్విల్లూరు
ఇవి మన ఆచ్చమైన
తెలుగుమాటలు.
ఇలాంటి పదాలతో మన పూర్వీకులు సరస సంభాషణలను, సాగించేవారు.ఒకవైపు సంస్కృతం ఉన్నప్పటికీ మరోవైపు తెలుగు భాష వెలుగు చక్కగా ఉండేది. సంస్కృత ప్రభావంతో తెలుగు మాధుర్యాన్ని సంతరించుకున్నది. 
కానీ తెలుగు పదాలు మూలబడ్డాయి.ప్రస్తుతం ఇంగ్లీష్ భాష అవసరము ఎక్కువైపోయినందున ఉన్న తెలుగు కూడా పోకుండా చూసుకోవాలి.సుభద్ర అన్న దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పైట సవరించి వచ్చినదని తిమ్మక్క చెప్పడంలో స్త్రీకి వస్త్ర ధారణ ఎలా ఉండాలి,అన్నవద్దకైనా నిండుగా పవిట కప్పుకొని వెళ్ళాలి అని కవయిత్రి సూచించడం గమనించాలి.



కామెంట్‌లు