అమ్మకోసం ...!!: ----శ్రీమతి శ్రీదేవి.(చిలుకూరి.)వేమవరపు.

 అమ్మా అని పిలవక 
నాలుగు దశాబ్దాలు 
వెళ్లిపోయాయి ….నిశ్శబ్దంగా !!
కానీ  .....
నీ కొంగు కప్పుకుని నిద్రపోయిన 
బాల్యపు  వెచ్చదనం మాత్రం ….
ఇంకా సందడి చేస్తూనే ఉంది 
నీ జ్ఞాపకం గా  ….
అచ్చం  నీ ప్రేమ లాగా ….!
ఒకటి మాత్రం నిజం …
నువ్వుంటే మాత్రం ….
"నా పిల్లలు వీళ్లు "అంటూ …
రోజూ అలవాటుగా 
మాకోసం ....
మొక్కుతూనే ఉండేదానివి 
మమ్ము రక్ష సేయమంటూ …!
అలాంటి రూపంతో మాకు 
కనువిందు చేస్తూ 
నవ్విస్తున్నావు ఈ రోజు !
నమ్మవు కదా ….
అందరం నవ్వుతున్నాము 
కళ్ళనిండా నీళ్ళతో …
గుండె నిండా నీ పైని ప్రేమతో …!!
                     ***
కామెంట్‌లు