త్యాగదనుడు అంబేద్కర్: నామ వెంకటేశ్వర్లు, S A తెలుగు , జి. ప. ఉ. పాఠశాల, అయిటిపాముల, కట్టంగూర్ మండలం

 ఆర్థికవేత్త, రాజనీతీజ్ఞడు, న్యాయకోవిధుడు, తత్త్వవేత్త, సంఘ సంస్కర్త,  బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి, అందరికి చిరపరిచితుడు, మరుపు రాని మహనీయుడు గా....పేరుగాంచిన వారు... అతనే డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 న, రాంజీ సత్పాల్ బీమా బాయిలకు 14 వ సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ గారి తండ్రి రాంజీ బ్రిటీ షు సైన్యంలో సైన్యాధికారిగా పనిచేశాడు. అతనిని గౌరవించడం ఇష్టం లేని కింది ఉద్యోగులు కుల పెద్దల సహకారంతో ఉద్యోగం నుండి తొలగింపజేశారు, కొద్ది నెలల అనంతరం రాంజీ కుటుంబం పూట గడపడం చాలా కష్టంగా ఉండేది. పేదరికం కూడా అనుభవించింది. అయినా కూడా రాంజీ పట్టు వదలని విక్రమార్కుడిలా పిల్లల చదువుపై శ్రద్ధ వహించేటట్టు చేసేవాడు, తల్లిదండ్రుల యొక్క పెంపకం,  వారు చూపిన మార్గంలోనేనిరంతరం నడిచేవాడు అంబేద్కర్.                                     
అంబేద్కర్ చిన్నతనం నుండే ప్రతి దాన్ని తాత్విక ఆలోచనలతోనే చూసేవాడు, ఎక్కడైనా ఏ విషయంలోనైనా అన్యాయం జరిగిందని తెలిస్తే చిన్నప్పటినుంచే ప్రశ్నించే  వాడు, ఆలోచనలు తగ్గట్టు తల్లిదండ్రులతో పాటు వారి ప్రియ గురువైనటువంటి కేలుస్కర్ గారి సూచనలు ఎప్పుడు అతనికి లభించేవి, తనకు సందేహం వస్తే ప్రతి విషయాన్ని గురించి తన గురువు గారితో చర్చలు సాగించేవాడు, ఆ నాటి సమాజం అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు చాలా బాధలు పెట్టింది. తరగతి బయట కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు, వివక్ష చూపినప్పటికి ఉన్నత చదువుల వరకు కొనసాగుతూనే ఉండేవారు , ఎక్కడ కూడా అతను నిరుత్సాహ పడకుండా నిరాశ చెందకుండా  బరోడా మహారాజు గారి యొక్క ఉపకార వేతనంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు కూడా ముగించుకొని రాగలిగాడు, దేశంలోనూ ఆసియా ఖండంలోను ఇప్పటివరకు అన్ని డిగ్రీలు చదివినవారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు. లండన్ లోని రాయల్ లైబ్రరీలోని పుస్తకాలన్నిటిని చదివిన వారిలో  మొదటివాడు కార్ల మార్క్స్ కాగా రెండోవాడు మ్యాజిని మూడవ వారం అంబేద్కర్ మాత్రమే. బాబాసాహెబ్ గారి గురించి, కొందరు అనుకున్నట్లు ఒక్క దళితుల పక్షమే వహించి పోరాడలేదు సకల ప్రజల వైపు నిలబడ్డారు, మచ్చుకు కొన్ని వివరిస్తాను, కార్మికులకు హక్కులు కల్పించడం.  వాటిలో పనిగంటలు,  సెలవు దినాల్లో వేతనాలు,  మంచి వేతనాలు, రోజుకు 8. పనిగంటలు, స్త్రీ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఆ సెలవులలో పూర్తి వేతనాలు ఇప్పించుట, స్త్రీలకు చదువు ఓటు హక్కు,  ఉద్యోగం,  ఆస్తి హక్కులు కల్పించాడు. చివరికి మహిళల హక్కుల కోసం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు వీగిపోయినప్పుడు తన కేంద్ర మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన  గొప్ప త్యాగమూర్తి  అంబేద్కర్. అంబేద్కర్ గారి త్యాగం కులాలకి మతాలకి జాతులకి అతీతమైంది....కాదు. (లాయర్ గా అంబేద్కర్  త్యాగం.......). బొంబాయి కోర్టు లో అంబేద్కర్ కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు ఈ కాలంలో ఆయన పేదవారి దగ్గర ఫీజు పైసా కూడా తీసుకునేవాడు కాదు పైగా కోర్టు ఫీజులు కాగితాల ఖర్చులు కూడా స్వయంగా భరించేవాడు ఇలా ఒకరో ఇద్దరో కాదు ఎందరైనా చాలా బలంగా వాదించి వారి కేసులను గెలిచేవాడు. కేసుల కోసం ధనవంతుల దగ్గర తీసుకున్న (తగినంత ఫీజుతో వచ్చిన) ఆదాయంతో పేదల కేసుల్ని గెలిపించడానికి వినియోగించేవాడు. ఒకసారి నిమ్న జాతుల వారి కోసం వకల్తా తీసుకున్నాడు. కేసుకు సంబంధించిన ఫీజు ఎక్కువ మొత్తం కట్టాల్సి వచ్చింది అది అంతా అంబేద్కర్ గారే పెట్టేవాడు. అనేక సాక్షాలతో కోర్టులో వాదించి ఆ కేసులు అంబేద్కర్ గెలిపించేవాడు, ఆ తర్వాత అంబేద్కర్ గారిని ముంబై లెజిస్ట్రేటర్ సభ్యుడిగా ఎన్నిక చేశారు,..... (పర్సనల్ పర్స్ నుండి  గా అంబేద్కర్.) 1930 నవంబర్ 12 నుండి జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు రమ్మని అంబేద్కర్ కి ఆహ్వానం పంపారు. శంకర్రావు అనే వ్యక్తి ప్రయాణ ఖర్చులకు గాను కొంత డబ్బు అందించాడు అందులోని తన ఖర్చులను తగ్గించుకొని అధిక మొత్తాన్ని జనత అనే పత్రికకు, నిమ్న  జాతులు నడిపే ఉద్యమానికి దానం చేశాడు, అదే సమయంలో ఉన్న జనతా పత్రిక ద్వారా నిమ్న వర్గాల కు ఒక సందేశం ఇచ్చాడు అది మీరు మీకున్న సౌకర్యాలను త్యాగం చేయడానికి సిద్ధపడాలి,  లెక్కలు వేసుకుంటూ కూర్చోకుండా ముందుకు వెళ్లాలి అని అన్నాడు. 1930 దశకంలో అంబేద్కర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు ఆ సమయంలో కూడా ఆయన పూర్తి కాలాన్ని దాస్య విముక్తి ఉద్యమాల్లోనే గడిపాడు. ఆ సమయం లో తన భార్య అయినటువంటి రమాబాయి మరణించింది. ఆ తర్వాత కూడా ఎంతో బాధ్యతతో దీనత్వాన్ని భరించాడు, శీలత్వాన్ని నిలదొక్కుకున్నాడు ఆ సమయంలో ఒక అవకాశం వచ్చింది అంబేద్కర్ కి. బొంబాయి ప్రభుత్వం ఆయనకు బొంబాయి లా కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమించింది ఆ బాధ్యతలు తీసుకుని సమర్థవంతంగా నిర్వహించాడు,  దీనితో బొంబాయి గవర్నర్ బొంబాయి హైకోర్టు జడ్జి పదవి చేపట్టవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. అయినా మంచి జీతం వచ్చే ఆ రెండు పదవులను వదిలేసి మరలా ఉద్యమ బాట పట్టాడు. ( అంబేద్కర్.  మంత్రిగా త్యాగం.....) 1937 మార్చిలో బొంబాయి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అప్పుడు అంబేద్కర్ గారు కార్మిక మంత్రిగా ఉన్నాడు, అప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఒక మంత్రికి 500 రూపాయల జీతం,  ఇతర సౌకర్యాలు ఉండాలని శాసనసభలో ప్రకటించారు, కానీ మంత్రులనే వారు త్యాగానికి దేశభక్తికి సంకేతంగా ఉండాలి  అంత ఎక్కువ జీతాలు అన్ని రకాల సౌకర్యాలు అవసరం లేదు అని చెబుతూ నాకు 75 =00 రూపాయల జీతం చాలు అన్నాడు అంబేద్కర్, దీన్ని అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు శ్రీ బి జి కేర్ శాసనసభలోనే అంబేద్కర్ త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించాడు. డబ్బు పదవి కోసం అంబేద్కర్ ఎన్నడు ప్రాకులాడలేదు, పిసినారివాడు ఎప్పుడు త్యాగీ కాలేడు, ఈర్ష అసూయ ద్వేష భావాలు ఉన్నవారు త్యాగం చేయలేరు మానవతా వాది మాత్రమే త్యాగాలు చేయడానికి వెనుకాడడు అనే విషయం అంబేద్కర్ కు బాగా సరిపోతుంది. (దేశం కోసం అంబేద్కర్ ప్రాణదానం.... )దళిత వర్గాలకు మేలు చేసిన వాడిగా మాత్రమే అనుకుంటారు కొందరు. ఇది వారి యొక్క సంకుచిత స్వభావానికి తార్కకాణం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎందరో ఉన్నారు వారి సరసన నిలబడదగినవాడు అంబేద్కర్,  ఎందరో స్వతంత్ర కోసం ప్రాణత్యాగం చేశారు కానీ స్వతంత్రం వచ్చాక దేశం తన కాళ్ళ మీద నిలబడడానికి,  తెచ్చుకున్న స్వతంత్రాన్ని బతికించుకోవడానికి... . రాజ్యాంగం అవసరం, దీన్ని రూపొందించే బాధ్యత ఏడుగురు మీద పడింది. దానిని రాజ్యాంగ రచన సంఘం అని అంటారు. ( ముసాయిదా కమిటీ ) అయితే ఏడుగురిలో ఒకరు ముందుగానే రాజీనామా చేశారు, ఇంకొకరు మరణించారు,   మరొకరు తన రాష్ట్ర రాజకీయాలలో మునిగిపోయారు, ఇద్దరు అనారోగ్యంతో ఢిల్లీకి రాలేకపోయారు. ఆ సభ్యుల స్థానంలో  ఒకరిని మాత్రమే తీసుకున్నారు, కానీ ఆయన చేసింది ఏమీ లేదు, మిగిలిన ఐదు స్థానాలు పూరించలేదు, మిగిలింది ఒకరై న వారు అంబేద్కర్ మాత్రమే. రాజ్యాంగ రచన భారం మొత్తము ఒక అంబేద్కర్ మీదనే పడింది, రాజ్యంగ రచనకు పూనుకొని  2 సoవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం తీసుకొని, నవంబర్ లో రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించారు, ఆ రాజ్యాంగంపై దేశంలో అనేక చర్చలు, మార్పులు 👌చేర్పులు  జరిగాయి, అనంతరం 1950 జనవరి 26న రాజ్యాగం ప్రతి అమలులో కి వచ్చింది. రాజ్యాంగ రచన సంఘంలో ఏ వ్యక్తి పాత్ర లేదు, అందులో రాసిన అక్షరాలు వారి సంతకాలు మాత్రమే, ఆ భారమంతా అంబేద్కర్ గారి మీదనే పడిందని, రాత్రి పగలు నిద్రాహారాలు  మాని తానొక్కడే రాజ్యాంగాన్ని రాశాడని  తమిళ బ్రాహ్మణ  సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో  ప్రకటించారు. ఒక సందర్భంలో రాజ్యాంగ పరిషత్తు లోకి రావడానికి కూడా అంబేద్కర్ గారికి అనేక పార్టీలు అనేక రకాలుగా అడ్డంకులు కలిగించారు, (అడ్డు పడ్డారు ) అయినా ఒక త్యాగమూర్తి త్యాగం వలన రాజ్యాంగ పరిషత్తులోకి రాగలిగాడు. ఆ నాటి కులాన్మాదమే ఆయనను రాకుండా అడ్డు పడింది. అ విశ్రాంత  రాజ్యాంగ రచన వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు, ఇంకా అతను ఎప్పుడు కోలుకోలేదు  చనిపోవడం జరిగింది.
 దేశం కోసం త్యాగం చేసిన ఒకే ఒక్కడు అంబేద్కర్ మాత్రమే, ఇది ఆయన దేశం కోసం చేసిన అతి పెద్ద త్యాగం. వ్యక్తిగత విషయాలకు సొంత వారికోసం ప్రయత్నించలేదు,  ఒకసారి ఈ విధంగా ప్రకటించాడు, వ్యక్తిగత ప్రయోజనాలు దేశ ప్రయోజనాల మధ్య వివాదం వస్తే నేను దేశ ప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇస్తాను అన్నాడు.  ఇంకా అధ్యక్ష నేను ఎప్పుడు ధర్మం కానీ మార్గంలో నడవలేదు నడవను,  ఇతరుల వలె నేను కూడా నా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకొని ఉంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాడినని ఒక సందర్భoల్లో అతను అన్నాడు. అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు త్యాగి అనడానికి ఇలాంటి ఉదాహరణ లు కాకుండా అ నాటి సమాజం వెలికి రానియని అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. బంతి ని ఎంత గట్టిగ నేలకు కొడితే అది అంత గట్టిగా తిరిగి వస్తుంది అనేది అంబేద్కర్ గారి విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజమని నిరూపణ అయినది....  

కామెంట్‌లు