కదనం కవాతు లేని వదనం నవ్వే ఊరు నే చేరగా
కలలు పండే కలతదీర ఆట గెలిచే పల్లెసీమ మది
కడుపు నింపే మాట కథ చేరని కంచి ఊరుమంచి
ఊరుబాట గట్టి అమ్మమనసే బతుకు కాంతిదండ
కలబంద మొక్క గన్నేరుపూలు ఊరు ఉనికి ఏరు
నింగివాన నేల ఈనే పంట కంటి భాష ప్రేమ పల్లెల
బిశాది ఏంది బతుకు నాది ఊరువాడ షాదీతోఫా
ముక్కు మీద కోపం కన్నెవెన్ను వంగని నిటారేలే
మమతలీడేరు మనసేఊరు పనితీరే చేప్పే నీపై
అంతులేని కథ కాదు కథే మన ఊరు పాండవులే
అడవివెన్నెల ఊరంతా కాచే చేతి కాయలే పూచే
బావి గిరుక అయ్యగారి అలకలే పల్లే రామచిలుక
ఊరంతా నీవునేను మరువనిదే బంధం ప్రేమమది
అప్పుడెప్పుడో చూస్తిఊరు నిన్నొచ్చినట్టే వన్నెలు
నాతోటోళ్ళు తక్కువే పై తరంవచ్చే ఊరు మర్వదే
హుషారంతా ఊరు అచలం కాదు వాడే చలనం
లయ ఆలయశిఖరం కల బంజరు పండేనా ఊరు
గింజకోసం గుంజాటన గుంజిలాగే ఊరే మూలుగ
అవసరం ఆవకాయ మడిగట్టే పల్లేజల జల ఊరే
సూదంటు రాయి గుండె కన్నులాగే ఊరు లోతుల
పరదాల ముందూవెనుక సరదాల పల్లే వరదగుడి
===============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి