ఊరుగాలి ఈల 102:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
వాడు మంచిగనే కనిపిస్తడు పల్లెలా మర్మంలేదు
అమ్మడం కొనడం తేలికకాదు అడవి మారే ఊరు 
మెత్తగ ఉంటడు పల్లెసీమ పూచేపూల గాలితీరు

నమ్మకమే ఊరుగదా నమ్మే బతుకే ఊరుపా పదా 
రాముడు మంచి బాలుడే పల్లెసీమే వీడనిదిచూడ
తేడాల్లేవు తెగల్లేవు పగల్లేవు నగల్లేవు ఊరు గొప్ప

పురుగు తొలిచే మెదడు ఊరు కదిలే శాంతిబాట
అదిగాదురా ఆగక నడిచేదే బతుకు కదులు పనికి
పొద్దుగూకొచ్చే ఇంకేంజెప్ప బతుకే అనుభవగీతం

అందరూ మాట్లాడ్తరు మాటమాటకు ఫరక్ దేఖో
అవుటర్ కూ ఇన్నర్ కూ నడుమ బాట ఊరుదే
మదివీణలే తీగలై సాగిమోగే పల్లె బతుకుపాట

ఒక మంచి సంకుచితానికి పడదు పల్లేలో కంచి
ఆట రూల్స్ తప్పదు మాట నీతి తప్పదు ఊరది
కోరదేదీ నిన్ను పంచే  మమతంతా ఊరు బోధిట్రీ

ఆశపడదు వగలుపోతే పల్లెచూపే మనసుచిక్కక
రాసుడే పని వానికి పుస్తకమే పొలం సీ ఆకలి నిద్ర
నరమేధం లేదు పరధర్మం ఉండు ఊరు సాకేనన్నే

అబ్బో అంతా సిగ్గే ఊరుకొమ్మకు ఊపేకొంగే చిక్కే
ప్రేమే పచ్చనాకు వాడదు రాలదు మనసు పదిలం
వన్ వే టువేలే లవ్ ఓపెన్ టు ఆల్ పెళ్ళి పల్లె సిరి

============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు