ఊరుగాలి ఈల 115:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఉచితం ఏది అనుచితం ఏదో నాకుచెప్పే ఊరులే
ఊరంటే పల్లీయం సర్వకళా వేదిక అన్నిపూటలా 
ఊసులు గోసలేకాదు సకలజన ధర్మనీతినే పల్లెరా

విద్య ఆధ్యాత్మికం మంచిచెడు జ్ఞాన బోధబొడ్డు
రచన సాంకేతిక శాస్త్ర వైద్య విజ్ఞాన సిరుల పల్లె
చిత్రలేఖనం కుంచె గీతల దేవతల పల్లే పూజించ

కబడ్డీ దేశికళ ఆడే శివరాత్రి  దేశికవిత సోమనవే
భాషలన్నిట వేరుచాచినపల్లే తెలుగు కన్నడి తోవ
దేశభాషలల్ల ఇరుగుపొరుగు మాటే పల్లే పూనికచే

చరిత్ర భూగోళ భౌతిక మానసికశాస్త్ర గని ఊరు
నింగీ నేల సముద్రం గాలి నీరు పిలిచే బడి పల్లే
మాగ్నెట్ పట్టే ఇనుము పట్టని గాజు బూజు ఊరే

ఊరు తెలుపు చీకటికీ కపటికీ లేదు గాలాడదిక
బాధ తరతరాలదే మారలే కథలే కొత్త కాటు పల్లె
అనంతవాయువుల ఆక్సిడెంట్ జీరో ఊరే హీరో

పాట పల్లవి పద్యం గద్యం వాక్యం లెక్క ఊరుతీరే
మట్టిల అన్నీ ఊరు కదలికలే గిర్రల బండీ పల్లేపద
తొట్లెల పాప పాలకంకికలే కళ ఊరు నడక కిలకిల

మూడునెలల సినిమా కాదు ఊరుపాటే ఎంకినోట
త్రిపదల పల్లే జాగారం శివా
----------------------------------------
(ఇంకా వుంది )

కామెంట్‌లు