నవ్వుతూ బ్రతకాలిరా - 23:- సి.హెచ్.ప్రతాప్

 1. వెంగళప్ప: "  డాక్టర్,ఈ కళ్ళద్దాలు వాడడం మొదలెట్టాక నేను చదవడం మొదలెట్టగలనా ?"
డాక్టర్ : " ఓ ఎస్, నిరభ్యంతరంగా !"
వెంగళప్ప: "నేను మీకు చాలా ఋణపడి వున్నాను డాక్టర్, ఎందుకంటే నాకు ఈ రోజు దాకా చదవడం రాదు."
2. జేంస్ బాండ్ లాస్ ఏంజెల్స్ లో ఒక తెలుగు విధ్యార్ధిని కలిసి షేక్ హాండ్ ఇచ్చి " అయాం బాండ్, జేంస్ బాండ్, వాట్ ఈస్ యువర్ నేం"అని అడిగాడు.
ఆ విధ్యార్ధి వెంటనే చిరునవ్వుతో "అయాం నాయుడు, వెంకట నాయుడు... లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...ఇప్పుడు నా పేరు తిరిగి చెప్పండి " అన్నాడు.
ఆ మాటలకు జేంస్ బాండ్ కళ్ళు తిరిగి ఢామ్మని పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయాడు.    
3. సుధీర్  :"నేను రేఖకు ఏప్రిల్ ఒకటో తేదీన పెళ్ళి ప్రపోజల్ చేద్దామనుకుంటున్నాను"
సుశీల్ :" చాలా విచిత్రంగా వుంది.ఆ రోజునే ఎందుకు చేద్దామనుకుంటున్నావు ?"
సుధీర్  :" ఏముంది వెరీ సింపుల్. ఆమె నా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిందనుకో నా అదృష్టం గా భావిస్తాను. ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకో ఏప్రిల్ ఫూల్ అని అనేసి ఎంచక్కా వచ్చేస్తాను"
4. టిటి అడిగితే రెండు జేబుల నుండి రెండు టికెట్లు తీసి చూపించాడు వెంగళప్ప.
"ఆశ్చర్యం గా వుంది. రెండు టికెట్లు ఎందుకు కొన్నావు?" అడిగాడు టి టి
" ఒకటి పోతే ఇంకొకటి వుంటుందని జాగ్రత్త కోసం కొన్నాను" చెప్పాడు వెంగళప్ప.
" మరి రెండూ పోతే అప్పుడు ఏం చేస్తావు?" కుతూహలంగా అడిగాడు టి టి
" నేనేమైనా దద్దమ్మను అనుకున్నావా? నా దగ్గర మంత్లీ పాస్ వుంది గా. దానిని నీకు చూపిస్తాను" గర్వంగా చెప్పాడు వెంగళప్ప.  
 
కామెంట్‌లు