నవ్వుతూ బ్రతకాలిరా - 24:- సి.హెచ్.ప్రతాప్

 1. " ఈ చీర డిజైన్ అయితే చాలా బావుంది కానీ రంగే అసలు బావుండలేదు" అంది రంభ.
" రంగుదేముంది మేడం. ఒక్క ఉతుకుకే పోతుంది, అందుకని మీరేమి వర్రీ కాకండి"అసలు సంగతి చెప్పాడు సేల్స్ మన్.
2.క్లాసులో సన్నాసులు ఎవరైనా వుంటే లేచి నిలబడండి" కోపంతో అంది టీచర్.
"కొంత సేపయ్యాక లాస్ట్ బెంచీ లో వున్న గోపి లేచి నిలబడ్డాడు.
"నిన్ను సన్నాసి అని ఎందుకనుకుంటున్నావు? అడిగింది టీచర్.
" నేను అలా అనుకోవడం లేదు మేడం కాని క్లాసు మొత్తం మీద మీరే నిలబడడం బావుండదని కంపెనీ కోసం నేను నిల్చున్నాను" తాపీగా అసలు సంగతి చెప్పాడు గోపి.  
 
3. "నేను చేసిన ఈ వెరైటీ కూర ఎలా వుందండి?" గోముగా అడిగింది వనజ.
" పశువులు తినేలా వుంది" వచ్చే వాంతిని ఆపుకుంటూ కోపం గా అన్నాడు సుధాకర్.
"అయితే ఇంకొంచెం వేస్తాను వుండండి" వ్యంగ్యంగా చెప్పింది వనజ.
4. " తెలుగులో నెంబర్ వన్ రచయిత అయ్యుండి ఇంత అర్ధం పర్ధం లేని చంఢాలమైన కధ ఎలా రాసారు? "అడిగింది భార్య తన భర్తను.
" మన అబ్బాయిని ఒక మంచి ఇంగ్లీష్ కధను నెట్ నుండి డౌన్ లోడ్ చెసి ఇమ్మంటే నిద్ర మత్తులో పేజీలను ముందు వెనుక చేసేసాడు. ఇదేదో వెరైటి కధ అనుకొని నేను యధాతధంగా అనువాదం చేసేసాను" అసలు సంగతి చెప్పాడు రచయిత మురళి.

కామెంట్‌లు