1.“ఏవమ్మా !గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళాలని నిన్న హాఫ్ డే లీవ్ తీసుకున్నావు, కానీ సాయంత్రం ఐమాక్స్ థియేటర్ లోనుండి ఎవడితోనో వస్తూ కనిపించావు. ఏం తమాషాగా వుందా “అరిచాడు మేనేజర్ బ్రహ్మానందం
“నేనేం అబద్ధాలు చెప్పలేదు, మీరు చూసినాయన నా బాయ్ ఫ్రెండ్, వృత్తి రీత్యా గైనకాలజిస్ట్” వయ్యారాలు వొలకబోస్తూ అసలు సంగతి చెప్పింది స్టెనో లూసీ.
2." ఏమిట్రా ఆ వొళ్ళంతా కట్లు, యాక్సిడెంట్ గానీ జరిగిందా ఏమిటి? అడిగాడు గుర్నాధం.
“ యాక్సిడెంటూ కాదూ పాడు కాదు, పతియే ప్రత్యక్ష దైవమన్న సీరియల్ చూస్తూ వుండగా డిస్టర్బ్ చేసానని మా ఆవిడే ఒళ్ళు వాతలు తేలేలా కొట్టింది” ఏడుస్తూ అసలు సంగతి చెప్పాడు అప్పారావు.
3. “డాక్టర్ గారూ, మా అబ్బాయి పొరపాటున అయిదు రూపాయల బిళ్ళ మింగేసాడు, త్వరగా ట్రీట్ మెంట్ చేసి దానిని బయటకు తీయండి” గాభరాగా అన్నాడు మల్లేశ్వర రావు.
“మీరేం వర్రీ అవకండి.ఉద్యోగంలో లక్షలకు లక్షలు మింగేసిన మీరు శుభ్రంగా, దుక్కలా వున్నారు. వెధవది ఒక అయిదు రూపాయల కాసు మింగేసిన మీ వాడికి ఏమవుతుంది?” నెమ్మదిగా కిళ్ళి మనులుతూ చెప్పాడు డాక్టర్ పరంధామం.
4. "సగం విరిగి, మిగితా సగం గారలు పట్టి వున్న పళ్ళతో, నొట్లోంచి అంత అసహ్యంగా కంపు వస్తున్న వ్యక్తితో ఇందాక మాట్లాడావు. ఆయనెవరురా?" అడిగాడు ముఖేష్.
" అతను మా ఫ్రెండ్,వృత్తి రీత్యా పళ్ళ డాక్టర్" అసలు సంగతి చెప్పాడు శిరీష్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి