స్ఫూర్తిదాతలు 2 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం పూలమొక్కల్ని ఇష్టపడతాం. కానీ ఇప్పుడు డిమాండ్ ఉన్న మొక్క కలబంద. కూలీ కుటుంబం నుంచి వచ్చిన రూపారాం ధన్ దేవ్ ఇంజనీరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు.ఆయన కొడుకు హరీష్  జైసల్మేర్ లో ఇంజనీర్.కానీ తన పూర్వీకులు కూలీలు బడుగురైతులుగా  జీవించారు.తన సత్తా చూపాలనే ఉద్దేశంతో రాజస్థాన్ లోని థార్ ఎడారిలో కలబంద సాగు ప్రారంభించి  80వేల మొక్కలతో లాభాల బాట పట్టాడు. జాబ్ కి రిజైన్ చేసి" నేచురల్ అగ్రో" అనే కంపెనీ పెట్టి కలబంద గుజ్జుతో పేరుపొందుతున్నాడు. 7లక్షలమొక్కలతో కోట్లకి పడగలెత్తాడు.ఒడిషా కి చెందిన నగేష్ పాత్రో కూలీపని చేస్తూ దూర విద్య లో డిగ్రీ ఆపై పి.జి.చేసి ఫ్రీకోచింగ్ సెంటర్ ని ప్రారంభించాడు.తను పగలు లెక్చరర్ గా పనిచేస్తూ సాయంత్రం రైల్వే స్టేషన్ లో కూలీగా నెలకి 15వేల సంపాదనతో చదువు ఫ్రీగా చెప్తున్న ఆయన ఆదర్శ అధ్యాపకుడు.త్రివేణి ఆచార్య  ముంబై కామాటిపుర లోని వ్యభిచార కూపంలోని యువతుల పాలిట దేవత.మిలట్రీలో పనిచేసి రిటైరైన భర్త బాలకృష్ణ సాయంతో ఆమె కాపాడింది.కానీ భర్త రోడ్డుప్రమాదంలో చనిపోటంతో త్రివేణి"రెస్క్యూఫౌండేషన్" పేరుతో 5వేలమంది అమ్మాయిలను కాపాడింది.ఆశ్రయం కల్పించి ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇవ్వడం కొందరిని తల్లిదండ్రులకు అప్పగించారు 🌷
కామెంట్‌లు