రసగుళికలు::(6): డా. కె. ఎల్వీ . ప్రసాద్

  కసాయివాడు కూడా
అంతకఠినంగాఉండడేమో !
నాపై కసిపెంచుకున్న ....
నీ ...మౌనవ్రతంలా ....!!
-------------------------------------------------
మాట్లాడుకుంటూకొట్లాటలతో
మనసు పాడుచేసుకోడం కంటె ,
నీ..మౌనవ్రతమే నాకు ....
చెప్పలేనంత పెద్దకఠినశిక్ష .....!
---------------------------------------------------
దాచుకోవలసిన విషయాలు 
ధారావాహికలు చేసి ....
లేనిసమస్యలను సృష్టించుకోడం !
మనకై మనం ఇబ్బందులు కొనితెచ్చుకోడం !!
--------------------------------------------------------------
నీవు చూపించే అత్యంత అభిమానం ,
'ప్రేమ' గా నా నిఘంటువు నిర్వచించింది !
ఇప్పుడు నిఘంటువుని సవరించాలా ...లేక
నన్ను నేను సవరించుకోవాలా అనే సందిగ్ధంలో!!
-------------------------------------------------------------------
నీ చుట్టురా ప్రదక్షిణం చేసే నీ స్నేహబృందం ,
నిన్నొక సెలబ్రిటీనిచేసి పెట్టింది .....
నువ్విప్పుడు నాకు అందని ద్రాక్షపండు ...!
నేనేమో నీకిప్పుడు అర్థంకాని ఇనుపగుండు !!
-------------------------------------------------------------------
నువ్వు నాజీవితంతో ఆడుకుంటున్నావని 
నేను పొరపాటుపడుతున్నానేమో .....!
నేను నీస్నేహన్ని దుర్వినియోగం చేస్తున్నానని 
నీవైతే నాగురించి అనుకొవడం లేదుకదా ...!!
------------------------------------------------------------------
కామెంట్‌లు