వేలుపట్టి నడిపించే కలాన్ని ప్రేమతో గ్రంథమై పల్లె
నేను లేని గుర్తు ఊరు బతికినతృప్తి ఓ బర్త్ మోల్
దేనికీ షరతులులేని మైదానం పల్లెనీతి నిజాయితీ
రెండు గట్లను కలిపే తడిజల బతుకు ఈతవాకింగ్
సరబేసి అంకు ఆటలేదు ఢిల్లీకాదిది డస్ట్ బండి వే
అందరం ఇక్కడనుండే వీడిన చౌరస్తానే ఊరంటే
అమ్మమ్మ నుంచి మా అమ్ములుదాకాసీ ఊరే షాన్
ఎవరు కట్టారో ఊరు పదిలంగా చూపు ఆత్మగలది
తోక జాడించదు పీక బట్టదు ఊరు నా ఫ్రీఊపిరిగ
రాయలేని అందం చెప్పలేని భావం ఊరే బాలశిక్ష
ఎన్ని చెప్పినా ఎలాచెప్పినా విప్పని ముల్లే పల్లెనగ
వారువీరూ వీడువాడైనా మారందే ఊరువాడకద!
ఊరునేర్పే నీతి రీతి సోల్తీ ఐస్ ఫైర్ తీగ సిల్లీకాదు
మనసుల పెంచే మంచినింపే కోపం ఆకలిగెల్వనీకి
చెప్పదు మనసేంటో ఒప్పదు తప్పు పల్లె నిప్పునే
అసలు ఆడదు ఆడితే ఓడదు ఊరుధీర నింగినేల
చిన్నప్పటి గాలిమోటర్ ఎక్కే కల దీరే ఊరు సఫర్
కలలు కనడం కృషితో తృప్తిచెందడం గొప్పే పల్లెల
తొలివేగం తుదిచేర ధన్యం మొదల్లేక మధ్యపూజే
తరిఖుష్కీ ఎండావాన తడారి ఎడారి పల్లె పొలం
పచ్చగ బతికే గాలి నాదే లక్కుంటే ఊరే గజల్ సిరి
===================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి