అజాగ్రత్త :- ఇల్లెందుల లాస్యప్రియ-9వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల సిద్దిపేట జిల్లా-9704865816
 నళిని,రజిని ఇద్దరు ప్రాణ స్నేహితులు.చిన్నప్పటినుండి కలిసిమెలిసి ఆడుకునేవారు కలిసిమెలిసి బడికి వెళ్లేవారు ఒకరుంటే ఒకరు చాలా స్నేహంగా ఉండేవారు.తోటి స్నేహితులకు వీల్లంటే  అసూయ ఉండేది.ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్లేవారు.నళినికి ఏమి లేకున్న  ఇతరుల వస్తువులు అడుక్కొచ్చుకునేది.తోటి స్నేహితులముందు ఫోజులు కొట్టేది.ఇవన్ని రజినికి నచ్చేది కాదు.పరుల సొమ్ము పామువంటిదని హితబోధ చేసేది.ఐన నళిని వినిపించుకునేది కాదు.
కొన్ని రోజులకు  రజిని వాళ్లనాన్న బదలీపై నల్గొండకు వెళ్లారు.అక్కడే వారి కుటుంబం స్థిరపడింది.రజిని మంచిగా చదువుకుంటు ఉద్యోగం సంపాదించుకుంది.
తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి కుదిర్చారు.
అప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలు నళినికి పెళ్లికార్డు పంపిస్తుంది.నళిని ఎలాగైనా పెళ్లికి వెళ్ళాలని తల్లిదండ్రులను అడుగుతుంది.వారు ఒప్పుకోరు.ఐనా బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కొత్త డ్రెస్సులు,నగలు కావాలని తల్లిని అని అడుగుతుంది.క్రొత్త డ్రెస్సులు కొనిస్తుంది.నగలు పక్కింటి వాళ్ల దగ్గర అడిగి తెస్తుంది.అన్ని జాగ్రత్తలు చెప్పి నళినిని రాత్రికి రైలు ఎక్కిస్తారు.
నేను రజిని పెళ్లిలో నగలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని కలలు కంటూ నిద్రపోతుంది.నిద్రలేచే సరికి తన బ్యాగును దొంగలెత్తుక పోయారు.రైలులో పోలీసులను కలుస్తుంది.
ఎవరి బ్యాగులకు వారే బాధ్యులని వారు చెప్పుతారు.నళినీ విపరీతంగా ఏడుస్తుంది.మా అమ్మమాట విని ఇంటివద్దనే ఉంటే బాగుండేది.ఇప్పుడు నగలు పోయాయి ఎలా ఇంటికి వెళ్ళేదని బాధపడుతుంది.ఈమె అమాయకత్వాన్ని చూసి పోలీసులు సీసీ కెమెరాల్లో వెతకసాగారు.చివరకు దొంగలను పట్టుకుంటారు.
నళిని నగలను ఇప్పిస్తారు.రజిని పెళ్లి చూడకుండానే తిరిగి ఇంటికి వస్తుంది.జరిగిన విషయమంతాతల్లి దండ్రులకు చెబుతుంది.నగలు పక్కింటి వాళ్లకు జాగ్రత్తగా అప్పజెప్పుతారు.
అజాగ్రత్తగా ఉంటే ఎంత నష్టమో తెలుసు కుంటుంది.



కామెంట్‌లు