మనస్సంతా దుఃఖాతిశయమై
ఏకధాటిగా కన్నీరు వర్షిస్తుంటే
బ్రతుకున ఆటుపోట్లు తప్ప
ఆనందమే లేకుంటే
జీవితాన్ని ఏంచదవను
నిత్యం తడిసిన జీవనముఖపత్రమై
తడితడిగా తగులుతుంటే
ఏదరి దాపులేక
గాలివాటౌతున్న
బ్రతుకును ...
ఎటునుండివచ్చెనో మాయావి సుడిగాలి
చుట్టూముట్టినలిపేస్తుంటే
పంచభూతాలకు నాపై కాసింత దయలేదని మరింత శోకం
శ్లోకమై
నినదిస్తుంటే
నేను బోయనా కాదు కాదు
ఇంటింటి రామాయణం వ్రాయనా!?
దుఃఖగీతమే పాడనా!?
జీవన్ముక్తి గీతమై
గొంతెత్తనా---!?
ఏకధాటిగా కన్నీరు వర్షిస్తుంటే
బ్రతుకున ఆటుపోట్లు తప్ప
ఆనందమే లేకుంటే
జీవితాన్ని ఏంచదవను
నిత్యం తడిసిన జీవనముఖపత్రమై
తడితడిగా తగులుతుంటే
ఏదరి దాపులేక
గాలివాటౌతున్న
బ్రతుకును ...
ఎటునుండివచ్చెనో మాయావి సుడిగాలి
చుట్టూముట్టినలిపేస్తుంటే
పంచభూతాలకు నాపై కాసింత దయలేదని మరింత శోకం
శ్లోకమై
నినదిస్తుంటే
నేను బోయనా కాదు కాదు
ఇంటింటి రామాయణం వ్రాయనా!?
దుఃఖగీతమే పాడనా!?
జీవన్ముక్తి గీతమై
గొంతెత్తనా---!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి