మంచితనం:- గొల్ల నవ్య -తొమ్మిదవ తరగతి - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలి ఘనపూర్-జిల్లా మెదక్ -9666591708
  అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో కమల అనే అమ్మాయి ఉండేది. కమలకు కాలు చిన్నప్పుడే విరిగింది. ఏ సహాయమైనా అమ్మ ద్వారా ఆధారపడేది. కమలా ఒక రోజు బయట ఆడుతున్న పిల్లలను చూసి, వారితో ఆడుకోవాలనుకుంది. 
                   నేను మీతో ఆడుకోవచ్చా అని కమల వారిని అడిగింది. నువ్వు మాతో ఎలా ఆడుతావు కుంటుతూ ఆడుతావా! అంటూ పిల్లలు ఎగతాళి చేసి, నవ్వారు. కమలా చాలా బాధపడుతూ, నా కాళ్లు సరిగా ఉంటే బాగుండు, అందరితో ఆడుకునేదాన్ని అనుకుంటుంది.
             ఆరోజు కాస్త చీకటి కాగానే ఒక గుంతలో ఒక చిన్న పిల్లాడు పడి ఏడుస్తుంటాడు. ఎవ్వరు ఆ చిన్నపిల్లాడిని చూడలేదు. కమల కుంటుతూ ఆ గుంత వద్దకు వెళ్లి ఒక తాడు సాయంతో కాపాడుతుంది. విషయం తెలుసుకున్న అందరూ కమల మంచితనానికి అభినందిస్తారు. తెల్లవారి నుంచి పిల్లలందరూ కమలతో ఆడుతూ, అవసరమైతే వాళ్లు కూడా కుంటుతూ కమల చుట్టూ చేరి చప్పట్లు కొట్టసాగారు. కమలతో పాటు అందరూ ఆనందపడతారు.


కామెంట్‌లు