ఎంత ఆనందంమో
ఈ ఆశల దారి
తారల తళుకులు వొలికిస్తూ
సింధూర మందారాలను నింగిసిగ దూసి
ఆకుల నడుమ కొమ్మలకు
తురిమిన నజరానా
టూ వే దారి పైన
నడక ఉన్నది జీవే లేదు రాలేదు
అటూ ఇటూ కంచె కాపలా
చేనులేని చెల్కల గుండె విశాలం
ఊరును రెండు చేసిందా మరి
రెండూళ్ళను ముడేసిన పూలదండ దారమా
ఉనికి
మారిన చిరునామా
ఊరు
చినిగిన అంగీలో
నేను లేని
చిరిగిన కాగితం రాసే పద్యం
ఆశల పొద్దే
శుభ్రత గాలీ మట్టి ప్రాణం
మన బతుకే ఊరు గుడిసె
రాత్రి ఎద చీల్చుకొచ్చే
ఎవరు కనిపెట్టారోగాని మహా శిల్పి
గొప్పే తొవ్వ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి