నాకు..…..
ఎన్నో కష్టాలు ఉన్నాయి...
కానీ ...
నా కష్టాలు నేను భూమికి తప్ప ఎవరికీ చెప్పుకోలేను...
నేను పడిపోతున్నప్పుడల్లా నన్ను భూమి లేపుతూ ఉంటుంది... ఇప్పుడు మీరు భూమిని కాలుష్యం చేస్తున్నారు.. నన్నూ హింసిస్తూనే ఉన్నారు...... మా గురించి గొప్పలు చెప్పాలని నేను ఇలా చెప్పడం లేదు.
మేము లేమనుకోండి మీరు ఎక్కడ ఉంటారు.... ?
ఆహారం, అలంకరణ వస్తువులు , నీడ, పువ్వులు, మీ ప్రాణాధారం... ఇవన్నీ దొరుకుతాయా?
నన్ను ఊడబీకినా నాకేమీ బాధగా ఉండదు. నష్టపోయేది మీరే. నేను లేని నాడూ నా గురించి తెలుసుకున్న రోజూ మీరే బాధపడుతారు.
నన్ను కాపాడుతున్న భూమి లేకుంటే మీరు లేరు,నేనూ లేను. మనం వేసే ప్రతి అడుగు భూమిపైనే. మీరు ఇలా భూమిని పాడుచేస్తే నేను బ్రతకను సుమా!
నన్ను బ్రతికించుకోండి. మిమ్మల్ని బ్రతికిస్తా.
నేను, నా బంధువులు, మిత్రులందరం మీకోసం చనిపోవడానికి మాకు బాధేమి లేదు. కానీ మా కోసం మీరేం చేయగలరు? మీరు చేయగలిగింది ఒక్కటే......
అదే ఇందాక చెప్పానుగా.....
మమ్మల్ని బ్రతికించండి...
ఇదే ఈ భూమి మీద నేను చేస్తున్న హెచ్చరిక.
Nice
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి