విద్యార్థులకు కుర్చీలు, ప్లాంక్ ల పంపిణీ:

మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ కుర్చీలు మరియు ప్లాంకులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.లక్ష్మీ నరసింహం, మెట్టూరు గ్రామ సర్పంచి మొజ్జాడ రుక్మిణి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జామి భానుమూర్తి, వైస్ చైర్మన్ జి.లక్ష్మీ గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేశారు. దాతలు ఈ సామగ్రిని 129 మంది పదవ తరగతి విద్యార్థులకు అందజేసారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో సత్ఫలితాల సాధనకు రానున్న 30 రోజులు చాలా కీలకమని, కనుక విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సామగ్రి పాఠశాలకు ఉచితంగా బహూకరించు నిమిత్తం విరాళాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జామి భానుమూర్తి, మొజ్జాడ చక్రపాణి, బూర్లె శ్రీనివాసరావు, బర్రి యతిరాజు, గరుకు యతిరాజు, జె జనార్దనరావు, ఎ దశరథరావు, బి పాపారావు, జె శ్యాంసుందర్, వి తిరుమలరాజు, కె సంజీవరావు, బి సంజీవరావు, జి గోపాలకృష్ణ, పప్పు రాము బ్రదర్స్, బిల్లింగి క్రిష్ణా రావు మరియు పాఠశాల సిబ్బంది  సమకూర్చి పంపిణీ చేసారు.
కామెంట్‌లు