నక్క సులక్షణకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం

 హైదరాబాదు లోని సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ నక్క సులక్షణ ఉస్మానియా యూనివర్శిటీ నుండి పీహెచ్ డి (డాక్టరేట్) పట్టా అందుకున్నారు. వేములవాడ  రాజరాజేశ్వర దేవస్థానం విశ్రాంత, సూపరింటెండెంట్, ప్రముఖ కవి, పండితుడు నక్క బాలరాజు (రసస్రవంతి) కుమార్తె, ప్రముఖ  కవి, ఆధ్యాత్మిక సాహితీవేత్త  "కావ్యసుధ" మేనకోడలు అయిన సులక్షణ వేములవాడ సంస్కృత కళాశాలలో డిగ్రీ వరకూ చదువుకున్నారు.అనంతరం ఉస్మానియా యూనివర్శిటీనుండి సంస్కృతంలో ఎంఏ, ఎంఫిల్., చేశారు. *''శ్రీ వేంకటేశ చంపూ ప్రబంధాత్మ విశ్లేషణాత్మక అధ్యయనం''అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ  సంస్కృత విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.కె. వరలక్ష్మి పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఆల్వాల్ వెంకటేశ్వరనగర్లో నివసిస్తున్న సులక్షణకు ఆమె సోదరుడు ప్రముఖ కవి, జర్నలిస్ట్ ఎన్. రాజేష్, వేములవాడ సంస్కృత కళాశాల విద్యార్థి, అధ్యాపక బృందం, భర్త ప్రవీణ్ గౌడ్, మురళి, లావణ్య,శ్రీ దివ్య డా. వీరగోని చైతన్య గౌడ్, తదితరులు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు