సృష్టిని గావించి...
స్థిరముగా నుంచి....
లయమొనరించు.....
ఆ మూడుశక్తులకునూ
మూలమౌ శక్తి...
మరుగున యున్నది!
ఆ యేక శక్తియే...
అనేకమై...సృష్టిగా...
స్థిరముగా కొంత దనుక యుండి...
స్థితి యనిపించుక...
కాల మాసన్నమై ఒకటిగా ఐక్యమై....
లయ మనిపించుకొనె!
ఈ మూడింటి
ఆ మూల శక్తి నే....
బ్రహ్మ యని నీవు....
సైన్సు అని వాడు....
వాదించు కొనుటేల!?
ఎవడి అభిమతము...
వాడి మతమైచెలగగా...
ఆది పత్యపు హింస...
అవసరమ ప్రజలకు?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి