మాటలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మాటలు
తేనెచుక్కలుచిమ్మాలి
మాటలు
మల్లెపూలనుచల్లాలి

మాటలు
మదులనుతట్టాలి
మాటలు
తేటతెలుగునుతలపించాలి

మాటలు
కాంతికిరణాలువెదజల్లాలి
మాటలు
మూతులకుమాధుర్యమందించాలి

మాటలు
కడుపులునింపాలి
మాటలు
శ్రావ్యతచేకూర్చాలి

మాటలు
మమకారాన్నిపెంచాలి
మాటలు
నమ్మకాన్నికలిగించాలి

నోరుతెరిచేటపుడు
జాగ్రత్తగుండాలి
నోరుజారకుండా
కట్టడిచేస్తుండాలి


కామెంట్‌లు