న్యాయములు-782
" అతి తృష్ణా న కర్తవ్యా తృష్ణాం నైవ పరిత్యజేత్"న్యాయము
*****
అతి అనగా మిక్కిలి,అతిశయించు,దాటు.తృష్ణా అనగా దప్పిక,కోరిక,ఉత్కటేచ్ఛ,పేరాస.కర్తవ్య అనగా చేయదగినది ,కోయదగినది, నాశము చేయదగినది.నైవ అనగా న+ఏవ -నిజముగా కాదు, లేదు. పరిత్యజించు అనగా దేనినైనా వదిలి పెట్టడం లేదా త్యజించడం అనే అర్థాలు ఉన్నాయి.
ఎక్కువ ఆశ ఉండనూ కూడదు.ఆశను విడిచి పెట్టనూ కూడదు అని అర్థము.
అత్యాశ ఉండకూడదు.అలాగని అసలు ఆశే లేకుండా ఉండకూడదు. ఎందుకంటే అత్యాశ దుఃఖానికి దారి తీస్తుంది. అంతే కానీ ఆశ లేకుండా ఉండకూడదు. ఎందుకంటే మనిషిని బ్రతికించేది ఆశే.ఈ ఆశే అనేక సాంకేతిక , సాంస్కృతిక రంగాలలో అభివృద్ధికి, సుఖవంతమైన జీవితానికి కావలసిన సౌకర్యాలకు మూలమైనది.
ఆశ మానవుని జీవన శ్వాస. ఆశ లేనివాడు ప్రాణం లేని వానితో సమానము.బ్రతికినంత కాలం మనిషితో ఆశ కలిసి జీవిస్తుంది. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా, జీవితంలో సర్వం కోల్పోయినా మనిషిని ఈ భూమ్మీద బతికి ఉండేలా చేసేది ఆశే.
ఆశ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతూ రాసిన వేమన పద్యాలు కొన్నింటిని చూద్దామా...
ఆశ చేత మనుజు లాయువు గలనాళ్ళు/తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక/ మురికి భాండమందు మునుగు నీగల భంగి/ విశ్వదాభిరామ వినురవేమ!"... అనగా ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుతుంటారు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వాళ్ళు తిరుగుతూ వుంటారు.
ఈ ఆశ వల్లనే అనగా అత్యాశ వల్ల ఎవరెవరు ఎలా చెడిపోయారో చెబుతూ..
"నీళ్ళలోని చేప నెరిమాంస మాశకు/ గాలమందు చిక్కి గూలినట్లు/ఆశ బుట్టి మనుజు డారీతి చెడిపోవు/"... అనగా ఎరను చూసి ఆశపడిన చేప గాలానికి చిక్కినట్లు...
"ఆశ పాపజాతి యన్నింటికంటెను/ఆశ చేత యతులు మోసపోరె/ చూచి విడుచు వారె శుద్ధాత్ములెందైన/ విశ్వధాభిరామ వినురవేమ!" ...ఆశ చాలా పాపమయినది.ఆశ వల్ల మునులు సైతం చెడిపోయారు.ఆ ఆశను విడిచిపెట్టిన వారు నిష్కల్మషమైన మనసు గలవారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దురాశ లేదా అత్యాశను విడిచిపెట్టిన వారు నిష్కల్మషమైన వారు అని అర్థము. ఎందుకంటే మునులు లేదా యతులు సైతం తపః ఫలాన్ని పొందాలనే ఆశతోనే కదా తపస్సు చేసేది. కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.
చదవాలనే కోరిక, ఏదో సాధించాలనే తపన,నచ్చిన వృత్తిలో స్థిరపడాలన్న ఆశ మనిషికి పట్టుదల, కృషిని నేర్పుతుంది.నాది ,నేను అనే భావన ఆశ నుండే ఉదయించాయి.బతకాలనే ఆశ ఎన్ని కష్టాలనైనా భరిస్తుంది.బాగుపడాలనే ఆశ ఎన్ని ఆవరోధములనుండైనా బయటపడేలా చేస్తుంది. ఈ లోకంలో ఆశ అనే దీపమే నిరాశ నిస్పృహల చీకట్లను తొలగిస్తుంది. అత్యాశ అనే శలభం జీవితం అంతం అయ్యేలా చేస్తుంది.మంచి ఆశ మానవాళికి ఉపయోగ పడుతుంది.చెడు ఆశ మనిషి పతనానికి దారి తీస్తుంది.
కాబట్టి ఆశను ఆశయాల సాధనంగా ఉపయోగించి సమాజ శ్రేయస్సుకు మన వంతు ప్రయత్నం చేద్దాం.ఆత్మ తృప్తితో ఆనందంగా జీవిద్దాం.నాతో ఏకీభవిస్తారు కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి