మంచి ఆలోచన: సరికొండ శ్రీనివాసరాజు

 శివాని ఎన్నడూ లేనిది ఈసారి తన పుట్టిన రోజును ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నానని తన మిత్రులకు చెప్పింది. తన పుట్టినరోజు బహుమతిగా పంజరంలో ఉన్న రామ చిలుకలను తనకు ఇవ్వాలని అన్నది. మరే బహుమతినీ తాను స్వీకరించనని చెప్పింది.
      శివానీ పుట్టినరోజు రానే వచ్చింది. చాలా మంది స్నేహితులు వచ్చారు. పంజరంలో పెట్టి అమ్ముతున్న చాలా చిలుకలను బహుమతిగా స్నేహితులు బహుమతిగా ఇచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత శివాని అందరినీ బయటికి పిలిచింది. పంజరం ఓపెన్ చేయమన్నది. ఆశ్చర్యపోయారు అందరూ. మళ్ళీ చెప్పింది. పంజరం ఓపెన్ చేయమని. చేసారు అందరూ. చిలకలు ఎగిరిపోయాయి. అప్పుడు శివాని ఇలా అన్నది. "మనల్ని స్వేచ్ఛకు దూరం చేసి, ఎవరైనా బయటికి వెళ్ళకుండా ఇళ్ళలొనే ఉంచి పెంచితే ఎలా ఉంటుంది. జైళ్లలో ఏళ్ళ తరబడి బంధించినట్లు ఉండదూ? చిలకల పరిస్థితి అంతే. నా పుట్టినరోజు సందర్బంగా కొన్ని ప్రాణులకు అయినా స్వేచ్ఛ ఇవ్వాలని అనుకున్నా. ఈ అవకాశం ఇవ్వడమే మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్."  అని. సంతోషించారు అందరూ.

కామెంట్‌లు