వ్యక్తిగత పరిశుభ్రతతోనే రోగాలు దూరం:--ప్రజారోగ్య పర్యవేక్షణ అధికారిని భాగ్య

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల రోగాలు దూరమవుతాయని కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజారోగ్య పర్యవేక్షణ అధికారిని సుక్కభాగ్య అన్నారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆమె కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన 'వారానికో వక్త' కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'వ్యక్తిగత పరిశుభ్రత' అనే అంశంపై పిల్లలకు అనేక విషయాలు తెలియజేశారు. పిల్లలు పాటించాల్సిన అనేక జాగ్రత్తలను సూచించారు. పిల్లలు మధ్యాహ్న భోజనానికి ముందు చేతులు ఎలా కడుగుకోవాలో ఆమె ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఆరోగ్య అలవాట్ల గురించి ఆమె పిల్లలకు తెలిపారు. పాఠశాల పిల్లల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య 'వారానికోవక్త' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి వారం ప్రముఖులు, విషయ నిపుణులను పాఠశాలకు పిలిపించి మధ్యాహ్న భోజన విరామ సమాయంలో పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం 'వ్యక్తిగత పరిశుభ్రత' అనే అంశంపై పాఠశాలలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయురాలు కొనుకటి శ్రీవాణి, ఎఎన్ఎం లంక సరిత, ఆశా కార్యకర్త శారద, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు