సైన్స్ డే వేడుకల్లో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ బహూకరణ, విద్యార్థుల పాదపూజ.


 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గొర్లెతిరుమలరావు అధ్యక్షతన సైన్స్ డే, విద్యార్థులకు పరీక్ష సామగ్రి బహూకరణ, విద్యార్థులచే పాదపూజ కార్యక్రమాలు జరిగాయి. పాతపట్నం రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు  ముఖ్య అతిథిగా హాజరైరి. 
మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే సందేశాలకు కట్టుబడి భవిష్యత్తులో అందరి పెద్దల పట్ల గౌరవభావాలతో మెలిగి, వారి ఆశీస్సులతో గొప్ప భవిష్యత్తును పొందాలని ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. 
పారశెల్లి రామరాజు మాట్లాడుతూ, మన ప్రత్యక్ష దైవాలు, ఎల్లవేళలా మన బాగును కోరుకునేవారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులేనని వారికి ఎల్లవేళలా కృతజ్ఞతా భావంతో దైవమల్లే స్మరిస్తూ, జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. 
రామరాజు దాతృత్వంతో పాఠశాలలో గల 48 మంది పదోతరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఆయన ఉచితంగా బహూకరించారు. పదో తరగతి పరీక్షల్లో సత్ఫలితాలు సాధించి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని ఆయన అన్నారు. 
సీనియర్  సహోపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ, అమ్మా నాన్నలు, గురువులు చెప్పిన నీతివంతమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్యను సాధించాలని అన్నారు.
తొలుత 48 మంది విద్యార్థులూ తమ తల్లిదండ్రులను, సంరక్షకులను, ఉపాధ్యాయులను నమస్కరించి వారి పాదాలకు అభిషేకం చేసి, పాదపూజ గావించారు. పెద్దల ఆశీస్సులు పొందిన తామంతా ధన్యులమయ్యామని విద్యార్థులంతా తమ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు. 
ఇదే రోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, తూతిక సురేష్,  దార జ్యోతిలకు, రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ తరపున శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఆహ్వానితులుగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, కమిటీ సభ్యులు వి.రమాదేవి, కె. సుజాత, ఆర్. తవిటమ్మ, ఎం హైమావతి, ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రసంగించారు.  విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
కామెంట్‌లు