రాజేశ్ మంచి క్రికెట్ ప్లేయర్. అతని బ్యాటింగ్ పుణ్యమా అని అతని టీమ్ ఎన్నో విజయాలను సాధించింది. ఈసారి కూడా అతని టీమ్ రాజేశ్ ఒంటిచేత్తో తెచ్చి పెట్టిన విజయాల వల్ల ఫైనల్స్ చేరింది. ఫైనల్స్ లో చాలా పటిష్టమైన జట్టుతోనే తలపడనుంది. ఫైనల్స్ ఆట ముందురోజు ఆ జట్టు కెప్టెన్ శ్రీకాంత్ తోటి ప్లేయర్స్ తో సమావేశం అయ్యాడు.
"మన జట్టులో అందరూ బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా రాజేశ్ కష్టం, ఓపిక చాలా ప్రభావం చూపుతుంది. ఒకవేళ రాజేశ్ దురదృష్టం వల్ల తక్కువ స్కోర్ కే అవుట్ ఆయితే మన పరిస్థితి ఏమిటి? అందుకే అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి." అన్నాడు. ఈ మాటలు కొందరికి నచ్చలేదు. "క్రికెట్ 11 మంది కష్టపడితేనే గెలిచే ఆట. మేమంతా ఆడబట్టే గెలుస్తున్నాము. మేము లేకపోతే ఆ ఒక్కడి వల్ల సాధ్యం కాదు. ఒక్కడినే మెచ్చుకోవడం సరికాదు." అన్నారు వారు. ఈ మాటలు సతీశ్ రాజేశుకు చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్ లు బెస్ట్ ఆఫ్ త్రీ. అందులో రెండు ఆటలు గెలిస్తే ఛాంపియన్ అవుతుంది. మొదటి ఆటలో ఫస్ట్ బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. రాజేశ్ సతీశ్ ఓపెనర్లుగా దిగి మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్థి జట్టు చిత్తుగా ఓడిపోయింది. రెండో ఫైనల్ లో రాజేశ్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. మూడవ ఫైనల్లో ప్రత్యర్థి మొదట బ్యాటింగ్ తీసుకొని అతి భారీ స్కోర్ సాధించింది. రాజేశ్ ఓపెనర్ గా దిగాడు. రాజేశ్ కు జంటగా మరో ఓపెనర్ కోతలు కోసిన వాడు దిగాడు. రాజేశ్ అవకాశం వచ్చినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ పూర్తి అవకాశం ఎదుటి బ్యాట్స్మన్ కే ఇచ్చాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించ లేక ఒత్తిడికి లోనై ఒక్కొక్కరు ఔట్ అవుతున్నారు. ఇలా 7 వికెట్లు పోయాక రాజేశుకు తోడుగా సతీశ్ 8వ ఆటగానిగా వచ్చాడు. రాజేశ్ రెచ్చిపోయి ఫోర్లు, సిక్సర్లు బీభత్సంగా కొడుతూ అసాధ్యన గెలుపును సుసాధ్యము చేశాడు. అందుకే ఓర్వలేని తనం ఉంటే అది మననే దెబ్బ తీస్తుంది.
]ఓర్వలేనితనం : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి