విజయగౌరికి మద్దతుగా యుటీఎఫ్ విస్తృత ప్రచారం
 వచ్చే  శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యస్.మురళీమోహనరావు అన్నారు. విజయగౌరికి మద్దతుగా పెద్దదిమిలి, బాలేరు, భామిని, బత్తిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, భామినిలో గల కెజిబివి, ఎపిఎస్ డబ్ల్యూఈఆర్, ఎపి ట్రైబల్ వెల్పేర్ ఆశ్రమ పాఠశాలలు, ఎపి మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పర్యటించి ఆయన ప్రసంగించారు. నిస్వార్థమైన సేవలతో, నిరంతర పోరాటాలతో, నిష్కల్మషమైన కృషితో న్యాయపరమైన డిమాండ్ ల సాధనకై శ్రమించే కుటుంబ నేపథ్యమున్న కోరెడ్ల విజయగౌరిని గెలిపించి శాసనమండలికి పంపాలని ఆయన కోరారు.
రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాశరావు మాట్లాడుతూ

ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్న ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బలపర్చిన పీడిఎఫ్ అభ్యర్థి విజయగౌరిని గెలిపించాలని కోరుతూ ప్రసంగించారు. ఇప్పటివరకూ శాసనమండలికి పీడీఎఫ్ తరఫున పద్నాలుగు మందిని గెలిపించి పంపించడం జరిగిందని అదే విధమైన మద్దత్తునివ్వాలని వారి ప్రసంగాలలో గుర్తుచేశారు. నిజాయితీ నిబద్దతలతో కూడిన సేవలనందించి సత్ఫలితాలను అందజేయుటకై తపిస్తున్న విజయగౌరిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని యుటిఎఫ్ నేతలంతా కోరారు. ఈ పర్యటనలో మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శిలు ఇ.తిరుపతి రావు, కడ్రక ప్రసాద్, జిల్లా కౌన్సిలర్లు కె.క్రాంతి కుమార్, పి.లుడతాచిన్, సి.హెచ్.మార్కో, యస్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు