ఏ రంగు లేని రంగం సైన్స్!!!?: - డా ప్రతాప్ కౌటిళ్యా
 భౌతిక వాదులు ఆధ్యాత్మికవేత్తలు విద్యావేత్తలు మార్క్సిస్టులు జాతీయవాదులు సాంప్రదాయవాదులు అభ్యుదయవాదులు రాజకీయవాదులు సిద్ధాంత వేత్తలు సామాజిక కార్యకర్తలు స్త్రీవాదులు మేధావులు ధనిక పేదలు కవులు కళాకారులు అందరూ ఇష్టపడేది అందరూ అంగీకరించినది అందరికీ ఉపయోగపడేది అందరి అభివృద్ధికి తోడ్పడేది సైన్స్!! ఇది అందరూ అంగీకరించిన విషయమే. 
అందుకే రాజకీయాలను సిద్ధాంతాలను వదిలి రండి సైన్సును చదువుదాం సైన్సును నేర్చుకుందాం సహించును పరిశోధిద్దాం గొప్పగా ఎదుగుదాం గొప్పగా బతుకుదాం. శాస్త్రవేత్తలు సామాజిక కార్యకర్తలే రుషిలే మునులే గొప్ప ఆధ్యాత్మికవేత్తలే అంత ఏకాగ్రతతో గొప్పగా పని చేస్తారు. అందుకే మార్సిస్టులకు ఇదే మా ఆహ్వానం. సమాజాన్ని మార్చడం వేల సంవత్సరాలు పడుతుంది. సైన్స్ ను మార్చడం దశాబ్దాలు పడుతుంది. ముందు సమాజాన్ని కాదు సైన్సును మారుద్దాం. పేదలను ధనికులను చేద్దాం ఎదుగుదాం.. సైన్స్ తో వ్యాపారం చేద్దాం. సైన్స్ రంగానికి ఏ రంగు లేదు. సైన్సులేని రంగము లేదు. 
అందరం సైన్స్ కోసం బ్రతుకుదాం సైన్స్ కోసం పని చేద్దాం. ఇది యుద్ధం కాదు ఒక పద్ధతి. శతాబ్దాల మనిషి పేద ధనిక సామాజిక నేపథ్యాన్ని దశాబ్దాల్లో మార్చిన సైన్సును మనిషి మార్పు కోసం ఎన్నుకుందాం. రాజకీయాలను సిద్ధాంతాలను వదులుకుందాం. సైన్స్ కోసం పని చేద్దాం. ఆధ్యాత్మిక వాదులకు భౌతిక వాదులకు ఇదే మా ఆహ్వానం. 
జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ లో జరిగిన సమావేశంలో నా సందేశం. జెడి ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ ప్రొఫెసర్ యాదగిరి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జీడి. సత్కరించిన సందర్భం. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ కు నా కృతజ్ఞతలు.
డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు