దశాబ్దాలు గడిచిపోతున్నా
దాగనంటుంది
మోములు మారుతున్నా
మనసు మారనంటుంది
ఫలితకేశాల మాటున
ఫలిస్తూనే ఉంది
గుండెల చాటున గుట్టుగా
దాక్కుంటుంది
రుధిరంలో కలిసి ఋజువై
నిలిచింది
శ్వాసకు శ్వాసనందిస్తూ
తుదిశ్వాస వరకు వీడనంటుంది
తోడుగ ఉండడానికి బతికే ఉండమంటుంది
గులాబుల గుత్తేదారై పరిమళిస్తూనే ఉంటుంది
యాదికి వచ్చేటట్లు యామినై
దరిచేరుతుంది
అరుణకిరణమై నిత్యం
ప్రకాశిస్తుంటుంది
నిత్యాభిషేకమై నమకచమకాలతో అలంకరిస్తుంది
పూదండై మెడను చుట్టుకుంటుంది
అనుభూతుల అచలమై
కదలనంటుంది
సిరివెన్నెలై సింగారించుకొని
సిరిచందనమై గుభాళిస్తుంది
గోధూళి వేళలో గోమేధికమై
తనువున తానైపోతాది
సింగిడి వర్ణమై గగనసదృశమై
సాక్షాత్కరిస్తుంది
మంత్రపుష్పమై మార్మోగుతూ మైమరిపింపజేస్తుంది.
దాగనంటుంది
మోములు మారుతున్నా
మనసు మారనంటుంది
ఫలితకేశాల మాటున
ఫలిస్తూనే ఉంది
గుండెల చాటున గుట్టుగా
దాక్కుంటుంది
రుధిరంలో కలిసి ఋజువై
నిలిచింది
శ్వాసకు శ్వాసనందిస్తూ
తుదిశ్వాస వరకు వీడనంటుంది
తోడుగ ఉండడానికి బతికే ఉండమంటుంది
గులాబుల గుత్తేదారై పరిమళిస్తూనే ఉంటుంది
యాదికి వచ్చేటట్లు యామినై
దరిచేరుతుంది
అరుణకిరణమై నిత్యం
ప్రకాశిస్తుంటుంది
నిత్యాభిషేకమై నమకచమకాలతో అలంకరిస్తుంది
పూదండై మెడను చుట్టుకుంటుంది
అనుభూతుల అచలమై
కదలనంటుంది
సిరివెన్నెలై సింగారించుకొని
సిరిచందనమై గుభాళిస్తుంది
గోధూళి వేళలో గోమేధికమై
తనువున తానైపోతాది
సింగిడి వర్ణమై గగనసదృశమై
సాక్షాత్కరిస్తుంది
మంత్రపుష్పమై మార్మోగుతూ మైమరిపింపజేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి