కోపర్నికస్ పోలిష్ ఖగోళశాస్త్రవేత్త 1543లో తన కొత్త ఐడియాలతో "ఆన్ ది రివల్యూషన్స్" అనే పుస్తకంరాశాడు.ఆరోజుల్లో జనుల అభిప్రాయం ఏమంటే భూమి విశ్వంలో మధ్య గా ఉందని. కానీ కోపర్నికస్ ఏమన్నాడంటే భూమి తన అక్షం పై తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది చాలామంది ఆయన అభిప్రాయాన్ని కొట్టి పడేశారు జైల్లో పెట్టాలని ఆలోచించారు కానీ ఆ పుస్తకం రాసిన కొద్ది రోజులకే ఆయన మరణించాడు
ది ఎడ్వెంచర్స్ ఆఫ్ డాన్ క్విక్సోట్ తొలి ఆధునిక నవల గా ఆంగ్ల సాహిత్యంలో చోటుచేసుకుంది.దాదాపు 500ఏళ్లక్రితం సెర్వాంటెస్ అనే స్పానిష్ రచయిత జైల్లో ఉన్నప్పుడు రాశాడు.అప్పుల్లో మునిగి జైలు పాలైనాడు.కానీ ఈనవలతో అతని దరిద్రం తీరిపోయి జీవితం సుఖంగా సాగింది.డాన్ క్విక్సోట్ అతని బంటు శాంకోపాంజా సాహసకథ ఇది.హాస్యంగా బాధాకరంగా ఫన్నీగా వీరి సాహసాలు పాఠకుల్ని ఉర్రూతలూగిస్తాయి.తొలి ఆధునిక నవలగా ఎన్నో భాషల్లోకి అనువాదం చేయబడింది. ఓసామాన్యుడి కథ అతని తెలివితక్కువ పనులు చేష్టలు వినోదం కల్గిస్తాయి.మన తెలుగులో హాస్య వ్యంగ్యరచనలు వచ్చినా అవి ఆంగ్లంలోకి అనువాదం కాకపోవడంతో మనవరకే తెలుసు.చిలకమర్తి వారి "గణపతి" రేడియో నండూరి సుబ్బారావుగారు సీతారత్నమ్మ గార్లవలన వారి గళంలో తొణికిన హాస్యం నభూతో నభవిష్యతి🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి