పుస్తక ప్రపంచం!17 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఛార్లెస్ డికెన్స్ 19వశతాబ్దపు ప్రసిద్ధ రచయిత. "ది క్రిస్మస్ కెరోల్"1843 లో ప్రచురించబడిన పుస్తకం.ఇందులో అల్పమైన తుచ్ఛభావాలున్న ప్రధానపాత్ర ఎబ్నెజర్  స్క్రూజ్! డికెన్స్ సృష్టించిన అద్భుత పాత్ర ఇది.అల్పత్వ నీచమనస్తత్వంకి గీటురాయిగా ఆపాత్ర నిలిచిపోయింది." Bah,humbug"   అని ఆపాత్ర వాడిన పదాలు చిరస్థాయిగా జనాలనోళ్లలో ఆడుతున్నాయి నేటికీ!మన తెలుగు రోజువారీ ఎన్నో మాటల్లో కూడా రచయితల మాటలు వాడుతాం. నాకు గుర్తున్నంతవరకు" తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి"
( వరవిక్రయం నాటకం అని జ్ఞాపకం!రేడియోలో ఇలాంటివి పాత ఆణిముత్యాలు వినిపిస్తే ఆనాటి రచయితల గాత్రధారుల గొప్పతనం తెలుస్తుంది.)ఏభాషా సాహిత్యంలో లేని
 ఓప్రత్యేకత ఆంగ్ల సాహిత్యంలో
 ఉంది.బ్రాంటే సిస్టర్స్ గా పేరుగాంచిన ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిల్చిపోయారు. ఎమిలీ, ఛార్లొటే, యానీ అనే ఆముగ్గురు అక్కచెల్లెళ్లు తమ రచనలతో జనాల్ని ఒక ఊపు ఊపారు. యార్క్ షైర్ కి చెందిన ఈసోదరీమణులు ఆనాటి ఆంగ్ల క్లాసిక్స్ గా పేరు గాంచిన నవలలు రాశారు."జేన్ ఐర్, ఉదరింగ్ హైట్స్, దిటెనెంట్ ఆఫ్ వైల్డ్ ఫెల్ హాల్"విక్టోరియన్ కాలంలో రాయబడినవి.ఎమిలీ బ్రాంటే ఒకేఒక నవల"ఊదరింగ్ హైట్స్" తో జనాల గుండెలో తిష్ఠవేసింది. హీరో హీరోయిన్లు స్వార్ధపరులు గర్వం అహంకారంతో జగడాలు కయ్యాలతో గడిపారు.కాథరిన్ కథానాయిక హీరోని మోసంచేసి వేరేవాడిని పెళ్లాడటం, హీరో వేదన ఆకాలంలో జనానికి నచ్చి మెచ్చి ఆదరించారు.🌹
కామెంట్‌లు