అనగనగా ఒక ఊరిలో ఆరుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు అందరూ ఒకే తరగతి వాళ్ళు. అందరూ కలిసి ఎప్పుడు బడికి వెళ్లేవారు. వాళ్లు చాలా బాగా కలిసి ఉండేవారు. ఒక అమ్మాయి కుటుంబం వేరే ఊరికి వలస వెళ్లింది. ఇక ఐదుగురే మిగిలారు మళ్లీ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకు పని దొరికిందని వాళ్లు కూడా వలస వెళ్లారు. ఇంకో అమ్మాయి చదువుకోవడానికి హాస్టల్ వెళ్ళింది, ముగ్గురే మిగిలారు వాళ్లు చాలా బాధపడుకుంటూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి ఇలా అన్నది మన స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు అని అన్నది. ఇంకో అమ్మాయి నాకు వాళ్లతోనే ఉండాలని అనిపిస్తుంది అని అన్నది మళ్లీ ఒక అమ్మాయి ఏం చేస్తాం మన రాత ఇలా ఉంది వాళ్ల రాత అలా ఉంది. మనం వాళ్లు విడిపోవాలని ఉంది కావచ్చు.ఇలా ఉండగా ఒకరోజు మార్కెట్ కి వెళ్ళగా అక్కడికి హాస్టల్ కి వెళ్లిన అమ్మాయి వచ్చింది. అప్పుడే ఇంటి దగ్గరే చదువుతున్న అమ్మాయి చూసి ఆమె దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చావు అని అడిగింది. ఆమె నేను మొన్ననే వచ్చాను అని చెప్పింది ఎలా ఉన్నావ్ నువ్వు హాస్టల్ కు ఎందుకు పోయావు. అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అన్నది మా నాన్న చాలా తాగుతూ అమ్మని కొడుతుండేవాడు. ఇంట్లో సరుకులు తెచ్చేవాడు కాదు. తినడానికి ఏమీ లేవు. చేయడానికి పని లేదు ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అందుకే వెళ్ళా అని అన్నది. తర్వాత రోజు ఆ ముగ్గురు బడికి వెళ్లారు ఆ అమ్మాయి జరిగినదంతా మిగతా ఇద్దరితో చెప్పింది అందులో ఒకరు ఇలా అన్నారు పాపం వాళ్ళ నాన్న అలా చేయకపోతే మన దోస్త్ మనతోనే ఉండేది. కొన్ని రోజులు బాగానే ఉంది ఒకరోజు వలస వెళ్లిన అమ్మాయి ఫోన్ చేసింది తాను చాలా ఏడ్చింది. నేను వస్తా ఏడవ తరగతి అయిపోయాక అని అన్నది. అలా కొన్ని రోజులు గడిచాయి అందరిదీ ఏడవ తరగతి పూర్తి అయింది. ఎనిమిదవ తరగతికి మిగతా ముగ్గురు మిత్రులు వచ్చారు అందరూ సంతోషించారు ఆ ఆరుగురు మిత్రులు కలిసిమెలిసి ఉన్నారు.ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్లేవారు.
నీతి. స్నేహం ఎంతో మధురమైనది
నీతి. స్నేహం ఎంతో మధురమైనది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి