అనగనగా ఒక ఊరిలో లక్ష్మీ రామా అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక కూతురు ఒక కొడుకు ఉండేవారు. వాళ్ల పేర్లు సోను ఇంకా సీత. వాళ్ల ఇద్దరికీ బడికి పోయే వయసు వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కొడుకును మాత్రమే బడికి పంపించారు. కూతురిని మాత్రం వాళ్లతో పాటు వ్యవసాయ పనులకు తీసుకెళ్లేవారు. కానీ సీత మాత్రం వాళ్ళ తండ్రి చెప్పినట్లు వాళ్లతో వ్యవసాయ పనులకు పోయేది.అట్లా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సీత ఇంటి బయట దిగాలుగా కూర్చుని బడికి పోయి వచ్చే పిల్లలని చూస్తున్నది. ఆ పిల్లలలో వాళ్ళ తమ్ముడు సోను కూడా ఉన్నాడు. సోను వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఏమైంది అక్క అని అడిగాడు. సోను తమ్ముడు మన నాన్న నిన్ను మాత్రం బడికి పంపుతున్నాడు కానీ నన్ను వాళ్లతో పనికి తీసుకెళ్తున్నారు అని అన్నది. సీత. సీత వాళ్ళమ్మ పని నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి పని వంట పని చక్కగా చేసేది. సీత తమ్ముడు అక్క నువ్వు రంది పడకు నేను నాన్నతో చెప్పి నిన్ను బడికి పంపేలా చేస్తాను అని అన్నాడు. సోను చెప్పిన మాటలతో అక్క నవ్వింది. వాళ్ళ నాన్న పని నుండి ఇంటికి వచ్చాడు. నాన్న ఇంట్లోకి రాగానే నాన్న అక్కను బడికి పంపించు అన్నాడు సోను. వాళ్ల నాన్న సోనును కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది.మళ్లీ సోను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నాతోని అక్కను బడికి పంపించమని అడిగాడు సోను మా సార్లు బడిలో ఒక మంచి విషయం చెప్పారు అది ఏమిటంటే అమ్మాయి చదువు అవనికి వెలుగు అని. సోను తన మాటలతో వాళ్ల అమ్మ మనసు మార్చాడు. అక్కను బడికి పంపేలా చేశాడు. వాళ్ళ అమ్మ సోను చెప్పిన మాట విని సీతను ఎలాగైనా బడికి పంపీయాలని అనుకున్నది. ఒకరోజు రాము పనికి పోయి వస్తున్న దారిలో సోను చెప్పిన మాటలు రాముతో చెప్పింది లక్ష్మి. లక్ష్మీ చెప్పిన మాటలతో రాము కూడా బడికి పోవాలని అనుకున్నాడు. మరొసటి రోజు నుంచి సీతను బడికి పంపించారు సీత ఎంతో సంతోషంగా బడికి పోయింది. బడిలో మిగతా పిల్లలతో పాటు బాగా చదువుకుంది బడికి పోయి ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసేది. బడిలో ఇచ్చిన హోంవర్క్ ను కూడా చేసేది. సీత తాను బడికి పోవడానికి కారణం తన తమ్ముడు అని మనసులో అనుకున్నది. వాళ్ల తమ్ముడి దగ్గరకు వెళ్లి నీవు నన్ను బడికి పంపేలా చేశావు తమ్ముడు అని అన్నది .అప్పటినుండి ఆ కుటుంబం సంతోషంగా ఉన్నది. సీత బడికి వెళ్లి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకున్నది. మంచి పేరు తెచ్చుకున్నది అందుకే మహిళలను చదివించాలి.
నీతి బాలికల చదువు బంగారు భవితకు వెలుగు
నీతి బాలికల చదువు బంగారు భవితకు వెలుగు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి