ఉగాది :- కుక్కడపు శ్రీనివాసు -తెలుగు ఉపాధ్యాయులు-వల్లాల ఆదర్శ పాఠశాల-నల్లగొండ జిల్లా-9014162523

 వసంతం వసంతం శుభ వసంతం
చిత్రమైన చైత్రం వరాల నవ వసంతం
సృష్టి ఆరంభానికి సూచికగా వసంతం
చైతన్యాన్ని అంకురింప చేసే నవ వసంతం
తెలుగు నేలలో ఆనందాలు పంచే వసంతం
పచ్చదనంతో కళకళలాడే పల్లె సీమలు
రైతులను సంప్రదాయంగా గౌరవించే వేడుక
శ్రావ్యమైన వసంత కోకిల మధుర గానాలు
మామిడి తోరణాలతో మెరిసే గుమ్మాలు
షడ్రుచులను పరిచయం చేసే ఉగాది పచ్చళ్ళు
భవిష్యత్తును తెలిపే పంచాంగ శ్రవణం
కవులను సన్మానించుకునే శుభ సందర్భం
పెద్దలను స్మరించుకునే శుభ తరుణం
కష్ట సుఖాలను సమం అని చెప్పె పర్వదినం
అందమైన వసంతం "విశ్వావసు" నామ వసంతం
                        

కామెంట్‌లు