సెలవెరుగని అమ్మ:- డాక్టర్ చీదెళ్ళ సీతా లక్ష్మి-విశ్రాంత సహాయ ఆచార్యులు -హైదరాబాద్-చరవాణి:9490367383
(పల్లంటి ఆదిలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన జాతీయ కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత)
🌺🌈🌻🚩🔥🌷💐
కాలాలు మారినా 
కట్టెలనుండి గ్యాస్ పొయ్యి వచ్చినా
విద్యుత్ పొయ్యి వచ్చినా
మారనిది వంటిల్లు 
కాలానుగుణంగా నిత్యనూతనంగా
ఎంతో సుందరంగా ముస్తాబై
లేచినప్పటినుండి పడుకునే వరకు తోడు నీడగా వుండే అమ్మ నేస్తం వంటిల్లు!!

అలసటెరుగని అమ్మ
రోగమొచ్చినా రొష్టు వచ్చినా   చాతకాక పోయినా
పిల్లల ఆకలి, వారి ఇష్టాలు తెలిసి పొట్ట నింపే కన్నతల్లి!!

అన్ని ఉద్యోగాల్లో కనీసం వారానికి ఒక రోజైనా హాలిడే జాలీ డే
అమ్మకు  ఆ నాడు రెండింతలు పని
రెండు చేతులు సరిపోవు!!

ఎన్ని పనులతో సతమతమవుతున్నా
చెరగని చిరునవ్వుతో
చకచకా బొంగరంలా తిరుగుతూ 
ఇల్లు చక్కదిద్దుతూ
ఏకబిగిన
అందరిని సంతృప్తిపరిచే అష్టావధాని!!

 జిహ్వకు చేరకముందే రుచులు ఆఘ్రాణించే నాసిక
షడ్రుచులు ఆస్వాదించి 
వంట బాగుంది అని కితాబివ్వలేని భర్త !!

ఎన్ని గదులున్నా 
వంటిల్లు లేకపోతే శూన్యమే
వంటిల్లే కదా
అమ్మ సామ్రాజ్యం !!

ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
ఎంత రోగమొచ్చినా కుండకు రోగం రాదు
వంట లేని రోజు ఊహించలేము
అమ్మ పూర్తిగా చేతగాక అడ్డం పడినాడే  హోటల్ కూడు!!

సెలవెరుగనిది అమ్మ
లీవ్ తెలియనిది వంటిల్లు
అది లేకుంటే
బ్రతుకే లేదు!!
------------------


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అభినందనలు అమ్మ
అజ్ఞాత చెప్పారు…
అభినందనలు అమ్మ