ఓ నా ప్రేమా !:- గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి.-సెల్.9491387977-.నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రేమా ప్రేమా నాప్రేమా 
వినవే ఓ ప్రియ భామా
చెబుతా నీకో విషయం
పడకు నాపై సంశయం !

నీ ప్రేమంటే నాకు ఎంతో ఇష్టం
నువ్వు లేకుంటే కలుగును కష్టం
నీవు ఉండాలి ఎప్పుడు తోడు
నాకు ఉండదు అప్పుడు గోడు !

ప్రేమతో నువు నా దరి చేరి
ప్రేమించాలని నన్నే ఇక కోరి
అధరామృతం అందించావు
సుధధరహాసం చిందించావు !

ప్రేమలో నన్ను నీవు ముంచావు
ప్రేమేదైవం అని తెగ వాదించావు
నీవు అన్న మాటే నాకు ఇక వేదం
నేను ఇక చేయను నీతో ఏ వాదం !

నీ ప్రేమ నాలో పొరలి పొంగి పోతనంది
ఏ శ్రమ లేకుండా నా  మది లొంగి పోతనంది
నువ్వు నేను కలిసి అయ్యాము ఆ ప్రేమలోన బంది
ఇకముందు నీకు నాకు ఉండదులే ఇక ఇబ్బంది !


కామెంట్‌లు