ఏ గట్టుమీదనో చెట్టుపైనో
సిగజారిన కురుల అలల చెరువు
ఊగీ సాగే
అందం ఆరబోసే భ్రమ కురిసి
గాలి నయనాల స్వేచ్ఛ
బంధించే సమ్మోహన చూపుల విరహ కౌగిలి దరహాసమై
మురిసిన ముంగిలి
విసిరే క్రీగంటి జుంటితేనెల
మునిపంట నొక్కిన పెదవి
మధురాధరధారల
సరసపువేళ జాబిలి సమరం
చూడ కనులేవి వలపు
చెప్ప కనలేని మనసు
కలలో మాయ చిత్రం కదా
ఎక్కా మసి అందము
వర్ణనాతీత అనిర్వచనీయ రష్మి
కరిగిన కలకు అందమేది
విరిగిన అలకు బతుకేది
గాలివానలో
పచ్చనిపైరు నేలకు దిక్కులరిచే రేపటి ధూళి
ఏ అద్దము లేదు చూడగ ఇల
చూపగ కొసిరినదే నా అందము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి