చిన్నారి పిల్లలు:- --గద్వాల సోమన్న ,9966414580
అపురూప శిల్పాలు
అందాల కుసుమాలు
ముద్దులొలుకు బాలలు
ఉదయ కాల భానులు

పసి పిల్లల పలుకులు
జుంటితేనె ధారలు
నవ వీణ నాదాలు
సప్త స్వర రాగాలు

లేలేత హృదయాలు
నెలవంక వదనాలు
చిన్నారి పిల్లలే!
తిలకింప మల్లెలే!

పెంచాలి ప్రేమగా
ఎంచాలి గొప్పగా
ఈనాటి బాలలే !
రేపటి ఘన పౌరులే!


కామెంట్‌లు