ఉగాది అంటే యుగానికి ఆది అని అర్ధం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది.చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మసృష్టి ఆరంభించిన రోజుకు సంకేతంగా ఉగాదిని జరుపుకుంటామని శాస్త్ర వాక్యం.శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మ దేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యర్థం 'ఉగాది' పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని మరొక కధ్నం ప్రాచుర్యంలో వుంది.ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ... ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది అని అంతారు.బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ అని కూడా ఒక కధ ప్రచారంలో వుంది.
శ్లో:
నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహ ధ్వజారోహణం నింబ పత్రాశనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభః
అంతే నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటు సత్కాలక్షేపంలో సమయం గడపాలి.ద్వారాలను తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే.
శ్లో: అబ్దాదౌ బంధుసంయుక్తే మంగళస్నానమాచరేత్ వస్త్రం రాభరణై ర్దేహమలంకృత్య తత శ్శుచిః
ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి, విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. అలాగే ఇష్టదేవతలను పూజించి, పెద్దల ఆశీస్సులు అందుకోవాలి.
ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటారు. అంటే దీనర్థం విశ్వానికి సంబంధించింది. ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి